Heart Attack : తాళి కట్టిన 15 నిమిషాలకే పెళ్లికొడుకు మృతి!
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. వధువు మెడలో తాళి కట్టిన 15 నిమిషాలకే పెళ్లి మండపంలో వరుడు గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. ఈ హృదయ విదారకమైన ఈ సంఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని జామ్ఖండి పట్టణంలో జరిగింది.