/rtv/media/media_files/2025/12/02/marriage-2025-12-02-17-35-37.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మానసిక ఒత్తిడి కారణంగా తన పెళ్లి రోజు రాత్రే ఇంటి నుంచి అదృశ్యమైన 26 ఏళ్ల పెళ్లి కొడుకు మూడు రోజుల తర్వాత హరిద్వార్‌లో కనిపించాడు. సరధనా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉంచాపూర్ నివాసి అయిన మొహసిన్ అలియాస్ మోను నవంబర్ 27న రాత్రి అదృశ్యమయ్యాడు.
సీసీటీవీ ఫుటేజీలో అతను
బల్బు కొనుక్కుని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మొహసిన్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, సీసీటీవీ ఫుటేజీలో అతను రాత్రిపూట గంగా కాలువ సమీపంలో తిరుగుతున్నట్లు కనిపించడంతో, అతను మునిగిపోయి ఉంటాడేమోనని పోలీసులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. రెండు రోజులపాటు గాలించినా అతని ఆచూకీ లభించలేదు.
అయితే, సోమవారం నాడు మొహసిన్ హరిద్వార్ నుంచి ఒక బాటసారి ఫోన్ ఉపయోగించి తన తండ్రికి కాల్ చేసి, తాను సురక్షితంగా ఉన్నానని, ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని తెలిపాడు. దీంతో మీరట్ పోలీసుల బృందం, అతని తండ్రి, బంధువులతో కలిసి హరిద్వార్‌కు వెళ్లి, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మొహసిన్‌ను గుర్తించారు.
పోలీసుల విచారణలో మొహసిన్ మాట్లాడుతూ.. పెళ్లి రాత్రి తాను భయపడిపోయానని వెంటనే హరిద్వార్ వెళ్లే బస్సు ఎక్కేశానని తెలిపాడు. అక్కడ మూడు రాత్రులు స్టేషన్ పరిసరాల్లోనే తిరుగుతూ గడిపినట్లు చెప్పాడుమొహసిన్‌ను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. తమ కుమారుడు సురక్షితంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పిల్చుకున్నారు.
Follow Us