/rtv/media/media_files/2025/05/01/auTJFsmNF5ANPsWLk1Yy.png)
marriage Devanahalli
కాసేపట్లో పెళ్లి.. కళ్యాణ మండపం కూడా రెడీ అయిపోయింది. వరుడు, వధువు ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చున్నారు. తాళి కట్టే సమయం కూడా వచ్చింది. అక్కడే వరుడు అడ్డం తిరిగాడు. అందరూ చూస్తుండగానే మంటపం నుంచి లేచి పూలదండను విసిరేసి పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన.. చెన్నరాయపట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవనహళ్లి తాలూకా బాలెపురలోని కల్యాణ మంటపంలో చోటుచేసుకుంది. వరుడు పెళ్లిని చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడానికి కారణం.. వధువుపైన ఉన్న అనుమానమే. గతంలో వధువుకు ఓ లవర్ ఉన్నాడని అతనితో ప్రేమాయణం నడిపించిందని వరుడు ఆరోపించాడు.
Also read : Namaz : విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం.. ప్రొఫెసర్ అరెస్టు!
Also read : India-Pak Border: టెన్షన్.. టెన్షన్.. సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నం
పెళ్లికి ముందే అన్ని చెప్పా
అయితే పెళ్లికి ముందు తాను అన్ని వరుడికి చెప్పానని.. అన్ని్ంటికి సరే అన్నాకే తమ పెళ్లికి కుదిరిందని చెబుతుంది. రాత్రి రిసెప్షన్ కూడా జరిగిందని.. సరిగ్గా మంటపానికి వచ్చేసరికి పెళ్లికి వరుడు నిరాకరించాడంటూ వధువు కన్నీటి పర్యంతమయింది. ఇది కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తమకు న్యాయం చేయాలంటూ వధువు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read : Bus Driver Namaz : నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం