Groom Shocks Bride: వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..పెళ్లిమండపంలో శృంగార వీడియో లీక్

చైనాకు చెందిన యువకుడు ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతనిపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నమ్మించింది. కానీ,పెళ్లికి ముందే ఆమె సోదరి భర్తతో శృంగారంలో పాల్గొన్నట్లు వరుడికి తెలియడంతో సదరు వీడియోను పెళ్లిమండపంలో లీక్ చేసి మోసం చేసిన వధువుపై పగ తీర్చుకున్నాడు.

New Update
Groom shocks bride, leaks erotic video at wedding venue

Groom shocks bride, leaks erotic video at wedding venue

Groom Shocks Bride:

ఒకప్పుడు పెళ్లికి ముందు పరాయి మగాడితో మాట్లాడితేనే ఆడవారిని అపార్థం చేసుకునేవారు. కానీ, కాలం మారింది. పెళ్లికి ముందే అమ్మాయిలు అన్ని కానిచ్చేస్తున్నారు. అలా అని ఇది నా అభిప్రాయం కాదు పలు సర్వేలు చెబుతున్న వాస్తవం. మగవారితో పోల్చుకుంటే ఆడవారే ఎక్కువ శాతం పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నట్లు తేలింది. చాలామంది యువతులు పెళ్లికి ముందు తమ భాయ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొన్నామని ఒప్పుకుంటున్నారు. అయితే పెళ్లికి ముందు జరిగిన విషయాలను మరిచిపోయి పెళ్లి తర్వాతనైన కట్టుకున్నవాడితో హాయిగా కాపురం చేస్తే పర్వాలేదు. కానీ, కొంతమంది భర్త ఉండగానే ప్రియుడితోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇది ఎప్పుడో ఒకప్పుడు లీక్ కాక తప్పదు. దీంతో తమకు అడ్డు ఉన్న భర్తలను అడ్డంగా లేపేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇవే కథనాలు. అయితే చైనాలో మాత్రం దీనికి భిన్నంగా జరిగిన సంఘటన సంచలనం రేపింది.చైనాలో జరిగిన ఈ సంఘటన నేటి యువత తీరుకు అద్ధంపడుతోంది.

Also Read:‘కింగ్డమ్’ మూవీ హిట్టా? ఫట్టా?.. అదిరిపోయిన రివ్యూ

చైనాకు చెందిన ఒక యువకుడు ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతనిపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నమ్మించింది. ఇద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువచ్చారు. అనుకున్నట్లు పెళ్లి రోజు కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు.అబ్బాయి, అమ్మాయికి ఇద్దరికి జీవితంలోనే మరిచిపోలేని రోజు. కానీ పెళ్లికి సిద్ధమైన అదే రోజు అబ్బాయికి షాకింగ్ నిజం తెలిసింది.. తను ఎంతో గాఢంగా ప్రేమించిన తనకు కాబోయే భార్య తనను చీట్ చేసినట్లు గుర్తించాడు. దీంతో తనను మోసం చేసిన అమ్మాయిని అందరి ముందు చీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతా అనుకున్నట్లే అమ్మాయితో కలసి నార్మల్‌గానే  పెళ్లి డ్రెస లో కళ్యాణ మండపానికి వచ్చాడు. అంతా బాగా జరుగుతుందని కుటుంబీకులు, అతిథులు అందరూ ఆనందంగా ఉన్న సమయంలో బాంబ్ పేల్చాడు. తనను మోసం చేసిన ప్రియురాలు, కాబోయే భార్యపై సాఫ్ట్ గా కసి, ప్రతీకారం తీర్చుకున్నాడు. 

కొద్ది క్షణాల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికొడుకు లేచి ఓ సరదా సంభాషణ మొదలు పెట్టాడు. పెళ్లిని కొద్దిసేపు ఆపేసి.. తమ ప్రేమ గురించి చెప్తూ..ఎలా ప్రేమించింది..ఎంతకాలం ప్రేమించింది చెప్పుకొచ్చాడు. అదే సమయంలో వధువును అందరికీ పరిచయం చేశాడు. అందరూ ఆసక్తిగా వింటున్న సమయంలో  ‘మేమిద్దరం ఎలా ప్రేమలో పడ్డామంటే’ అంటూ వెనక వైపున్న స్క్రీన్‌ పై ఓ వీడియోను ప్లే చేశాడు. ఆ స్క్రీన్స్ పై వధువు శృంగార వీడియో ప్లే అయింది. అంతే, అందులోని పెళ్లికూతురు సెక్స్ బాగోతాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా ముక్కున వేలేసుకున్నారు.

ఆ వీడియో ఏకంగా నాలుగు నిమిషాలపాటు ప్లే అయింది. వీడియో మొదలైందో లేదో.. పెళ్లికూతురు అరిచి గగ్గోలు పెట్టింది. పెళ్లికొడుకును ఉద్దేశించి.. చీటర్ అంటూ తిట్టుకుంటూ…. స్టేజీ దిగి వెళ్లిపోయింది. అయితే వధువు సోదరి కడుపుతో ఉన్న సమయంలో ఆమె భర్తతో ప్రస్తుత వధువు శృంగారంలో పాల్గొన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే సదరు సోదరే ఈ వీడియో వరుడికి ఇచ్చినట్లు తెలుస్తుంది.ఆ వీడియోను పెళ్లి మండపంలో బిగ్ స్క్రీన్‌పై ప్లే చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తం మీదా తన ప్రియురాలు తనను మోసం చేసిన విషయాన్ని అందరి ముందు బట్టబయలు చేసి వరుడు ప్రతీకారం తీర్చుకోవడంతో అంతా శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:బడా మోసం.. హీరో ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు

Advertisment
తాజా కథనాలు