/rtv/media/media_files/2025/05/20/DZuzZFisSY9bjmtl95WJ.jpg)
TG CRIME
పారాణి ఆరక ముందే వరుడు మృతి చెందిన విషాద ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి అయ్యి రెండు రోజులు కాకుండానే వరుడు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారం మండలం కోడిపుంజుల తండాకి చెందిన ఇస్లావత్ నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది.
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
విద్యుదాఘాతంతో కొత్త పెళ్లి కుమారుడు మృతి
— ChotaNews App (@ChotaNewsApp) May 20, 2025
మహబూబాబాద్: బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో పెళ్లింట్లో విషాదం. విద్యుదాఘాతంలో కొత్త పెళ్లి కుమారుడు ఇస్లావత్ నరేశ్ మృతి. రెండ్రోజుల క్రితం కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన వివాహం. pic.twitter.com/DmHhUCm1v5
ఇది కూడా చూడండి: Bangalore Rains: బెంగళూరులో వర్షాలే వర్షాలు.. రన్నింగ్ బస్సుల్లోకి నీళ్లు.. వీడియోలు వైరల్!
పెళ్లి జరిగి మూడు రోజులు పూర్తి కాకుండానే..
విజయవాడలో విహహం జరగ్గా రిసెప్షన్‌ను మంగళవారం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ సమయంలో ఇంట్లోని బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలింది. వెంటనే వరుడు అక్కడిక్కడే మృతి చెందగా.. వధువు జాహ్నవి తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
వెంటనే ఆమెను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెళ్లి జరిగిన సంతోషంలో కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఇంట్లోనే ఉండగా ఈ విషాదం జరిగింది. దీంతో అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. పారాణి ఇంకా ఆరక ముందే వరుడు మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు