/rtv/media/media_files/2025/04/18/E4M7t2IAEL8aYIca5vtp.jpg)
Bride Mother Jumps With Son in Law
Aligarh aunty : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కూతురునిచ్చి పెళ్లి చేయాల్సిన అత్త కాబోయే అల్లునితో లేచిపోవడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ఈ ఘటన అందరి దృష్టిలో పడడంతో కాబోయే అత్త 39 ఏళ్ల స్వప్న, అల్లుడు 25 ఏళ్ల రాహుల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లేచిపోయిన వ్యవహారం అందరి నోట తీవ్ర చర్చకు దారితీయటంతో దేశం దాటి వెళ్లాలని భావించిన ఈ జంట పోలీసులకు భయపడి తిరిగి వచ్చింది.
Also read: AP liquor scam: విచారణలో విజయసాయి రెడ్డి సంచలన విషయాలు
కుమార్తెతో రాహుల్‌కు మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా, స్వప్న అల్లుడితో లేచిపోవడం 10రోజుల క్రితం సంచలనంగా మారింది. ఇంతవరకు బాగనే ఉన్నా ఇప్పటికి అత్త మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తనకు అల్లుడే కావాలని పట్టుపడుతోంది. రాహుల్‌ను విడిచిపెట్టే ఆలోచన లేదని, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అతడినే పెళ్లి చేసుకుంటానని తెగేసిచెబుతోంది. తన భర్త తాగొచ్చి కొడతాడనీ అందుకే రాహుల్‌తో ఉండాలని నిర్ణయించుకున్నానని బహిరంగంగానే చెబుతోంది. ఇరు కుటుంబ సభ్యలు ఎంత చెప్పినా ఆమె తన మనసు మార్చుకోవడం లేదు.
Also read; GST on UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లుకు భారీ షాక్..!
ఇక తను అత్తతో వెళ్లడానికి కారణాలు వివరిస్తూ పెళ్లికి కొన్ని రోజుల ముందు తన భర్త తనను ఎలా హింసించేవాడో స్వప్న చెప్పడంతో తన మనసు చలించిపోయిందని రాహుల్ తెలిపాడు. అందుకే తనను లేపుకెళ్లిపోయినట్లు చెప్పాడు. అలీఘడ్ నుంచి లఖ్‌నవూకు, అక్కడి నుంచి ముజఫర్‌పుర్‌కు వెళ్లినట్లు రాహుల్ తెలిపాడు. తమ గురించి వెతుకుతున్నారని తెలిసి, పోలీసుల ముందు లొంగిపోయినట్లు చెప్పాడు. స్వప్న లొంగిపోయిన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. భర్తతో పాటు ఇద్దరు పిల్లలు తమతో రావాలని దాదాపు 8గంటల పాటు కోరినా ఆమె ఒప్పుకోలేదు. తల్లిని ఒప్పించే క్రమంలో పిల్లలు ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయినా ఆమె మనసు కరగలేదని కుటంబసభ్యులు వాపోతున్నారు.
Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!
నా సొమ్ము నాకివ్వండి
ఇది చూసి విసుగెత్తిపోయిన స్వప్న భర్త స్వప్న లేచిపోయేటప్పుడు మూడున్నర లక్షల నగదు, ఐదున్నర లక్షల విలువ చేసే బంగారం తీసుకెళ్లిందని, అదంతా తిరిగి ఇచ్చేయాలని ఆమె భర్త జితేందర్ అంటున్నాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనీ, అందుకే స్వప్నకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లు తెలిపాడు. స్వప్న చేసింది తప్పనీ, ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులతో పాటు ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. కాగా స్వప్న, రాహుల్ దేశ సరిహద్దులు దాటి నేపాల్‌కు వెళ్లి స్థిరపడాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు వెతుకుతున్నారని తెలిసి పోలీసులకు లొంగిపోయారు.
Also read: Rahul Gandhi: రోహిత్ వేముల పేరుతో చట్టం.. CMకు రాహుల్ గాంధీ లేఖ
 Follow Us