Gaza: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 94 మంది మృతి
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 94 మంది మృతి చెందారు. గాజా ఆరోగ్యశాఖ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. మానవతా సాయం అందిస్తున్న పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.