Gaza: గాజా శాంతి మండలికి మోదీకి ఆహ్వానం

గాజాలో శాంతి స్థాపన,యుద్ధానంతర పరిస్థితుల పర్యవేక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన "బోర్డ్ ఆఫ్ పీస్" లో భాగస్వామ్యం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం అందింది. ఈ మేరకు ట్రంప్ స్వయంగా మోదీకి లేఖ రాశారు.

New Update
PM Modi and Trump Likely to Meet on the Sidelines of ASEAN Summit on Oct 26

PM Modi and Trump

Gaza: గాజాలో శాంతి స్థాపన,యుద్ధానంతర పరిస్థితుల పర్యవేక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన "బోర్డ్ ఆఫ్ పీస్" (Board of Peace) లో భాగస్వామ్యం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం అందింది. ఈ మేరకు ట్రంప్ స్వయంగా మోదీకి లేఖ రాశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో శాంతి కోసం చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గాజా పునర్నిర్మాణం, పరిపాలనను పర్యవేక్షించేందుకు ఒక అంతర్జాతీయ మండలిని (Board of Peace) ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహిస్తున్నారు. దీనికోసం ఆయన మోదీకి లేఖ రాశారు.

Also Read: నీలి చిత్రాల్లో ఆఫర్‌ అంటూ హోటల్ రూమ్‌కి తీసుకెళ్లి...

ట్రంప్ లేఖలోని సారాంశం: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ట్రంప్  "పశ్చిమాసియాలో శాంతిని సుస్థిరం చేసేందుకు, ప్రపంచవ్యాప్త ఘర్షణలను పరిష్కరించేందుకు చేపడుతున్న ఈ మహత్తర ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని ఆహ్వానించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను." అని పేర్కొ్న్నారు. కాగా, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ లేఖను సోమవారం (జనవరి 19, 2026) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏమిటి?

ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా ఈ మండలిని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన బాధ్యతలు:
గాజా పునర్నిర్మాణం: యుద్ధంలో దెబ్బతిన్న గాజా ప్రాంతాన్ని తిరిగి నిర్మించడం.

పరిపాలన పర్యవేక్షణ: హమాస్ పాలన ముగిసిన తర్వాత గాజాలో ఏర్పడే తాత్కాలిక సాంకేతిక నిపుణుల కమిటీ (Technocratic Committee) కార్యకలాపాలను పర్యవేక్షించడం.

నిధుల సమీకరణ: అభివృద్ధి పనుల కోసం అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించడం.

Also Read: గులాబీ పార్టీలో గ్రూప్ వార్.. తలలు పట్టుకుంటున్న అధిష్టానం

ఎవరెవరికి ఆహ్వానం అందింది?

భారత్ తో పాటు పాకిస్థాన్‌కు కూడా ఈ మండలిలో చేరాలని ట్రంప్ ఆహ్వానం పంపారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఈ లేఖ అందినట్లు ఆ దేశం ధృవీకరించింది. వీటితో పాటు కెనడా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, అర్జెంటీనా, హంగేరి, అల్బేనియా వంటి మరో 10కి పైగా దేశాలకు ఈ ఆహ్వానాలు అందాయి.

Also Read: ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి : ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

భారత్ ప్రాధాన్యత

ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో భారత్‌కు ఉన్న చారిత్రక మరియు స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ట్రంప్ భారత్‌ను కీలక భాగస్వామిగా చూస్తున్నారు. గాజాకు భారత్ ఇప్పటికే గణనీయమైన స్థాయిలో మానవతా సాయం అందిస్తోంది. అయితే, ఈ ఆహ్వానంపై భారత విదేశాంగ శాఖ ఇంకా అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ మండలి సభ్యత్వం కోసం 1 బిలియన్ డాలర్ల విరాళం ఇవ్వాలనే నిబంధన ఉన్నట్లు కొన్ని అంతర్జాతీయ కథనాలు ప్రచారంలో ఉన్నాయి, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు