Gaza Master Plan: గాజా శవాల దిబ్బ మీద ట్రంప్‌కు కాసులు కురిపించే కంచుకోట.. బయటపడ్డ షాకింగ్ నిజం!

యుద్ధంలో చిన్నాభిన్నమైన గాజాని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలో ట్రంప్ అల్లుడు, వైట్ హౌస్ మాజీ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ యుద్ధానంతర గాజా పునర్నిర్మాణం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు.

New Update
gaza master plan

యుద్ధంలో ఇజ్రాయిల్‌కు సపోర్ట్ చేసిన ట్రంప్ యుద్ధం ముగిశాక గాజాపై ఒక్కసారిగా ప్రేమ పొంగుకొచ్చింది. గాజాపై అమెరికా అధ్యక్షుడు ఎన్నడూ లేని సానుభూతి చూపించడం వెనుక ఓ పెద్ద స్వార్థం ఉంది. అంతేకాదు గాజా పునర్నిర్మాణంలో ట్రంప్ వేల కోట్లు సొమ్ము చేసుకునే ప్లాన్ బయటపడింది. గాజాలో మాస్టర్ ప్లాన్ పేరిట రియల్‌ ఎస్టేట్ దందా స్టార్ట్ చేద్ధాంమని ట్రంప్ అల్లుడిని దింపాడు. యుద్ధంలో గాజా స్ట్రిప్ పూర్తిగా విధ్వంసమైయ్యేంత వరకూ చూసి అక్కడ జనాల్ని వేరే చోటుకు తరలించి ఆ విలువైన భూములు అమెరికా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూసింది. వేలాది గాజా ప్రజల శవాల దిబ్బలపై ట్రంప్ కాసులు కురిపించే కంచుకోట కట్టుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగా గాజా పీస్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి పనులు ప్రారంభించారు. పునర్నిర్మాణం పేరుతో గాజాని ట్రంప్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అక్కడ నిర్మాణాలు చేసేది కూడా ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్.. ఇతనో బాడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. యుద్ధంలో పూర్తిగా దెబ్బతిన్న గాజాని టూరిజం హబ్‌గా మార్చి డబ్బులు చేసుకుందామనే ట్రంప్ ప్లాన్ దావోస్‌లో బయటపడింది. 

ఇజ్రాయిల్‌తో యుద్ధంలో చిన్నాభిన్నమైన గాజాని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అగ్రరాజ్యం అమెరికా(america) ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలో డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, వైట్ హౌస్ మాజీ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ యుద్ధానంతర గాజా(develop Gaza as a tourist destination) పునర్నిర్మాణం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన ఈ ప్రణాళికను వివరించారు. కుష్నర్ రూపొందించిన ఈ ప్రణాళికలో గాజాని మధ్యప్రాచ్యపు 'రివేరా'లాగా మార్చాలనేది టార్గెట్. ఈ నిర్మాణం కేవలం రెండు లేదా మూడు సంవత్సరాలలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆధునిక యుటిలిటీలు, ప్రజా సేవలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రణాళికకు $25 బిలియన్లకు పైగా అవసరమని శాంతి బోర్డు అంచనా వేసింది. రాబోయే 100 రోజుల్లో గాజా స్ట్రిప్‌లోని బిల్డింగ్ శిథిలాలు తొలగించే పని పూర్తి అవుతుందని కుష్నర్ తెలిపారు. దాదాపు 68  మిలియన్ టన్నుల శిథిలాలను తొలగించడానికి, రోడ్లను తెరవడానికి అవసరమైన పరికరాల చేర్చుతామన్నారు. అక్కడ పనులు మొదలు పెట్టడానికి మనుషులను చేర్చనున్నారు.

Also Read :  రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు

నాలుగు దశల డెవలప్‌మెంట్

ఈ మాస్టర్ ప్లాన్ గాజా సిటీని నాలుగు మెయిన్ జోన్లుగా విభజిస్తుంది.

అవి: రాఫా (సిటీ 1), ఖాన్ యూనిస్ (సిటీ 2), సెంట్రల్ క్యాంప్స్ (సిటీ 3), గాజా సిటీ (సిటీ 4). న్యూ రఫాలో 100,000 కంటే ఎక్కువ ఇళ్లు, 200 విద్యా కేంద్రాలు, 180 సాంస్కృతిక, మతపరమైన, వృత్తిపరమైన కేంద్రాలతోపాటు 75 హాస్పిటల్స్ ఏర్పాటు చేయనున్నారు.

టూరిజం అండ్ ఎకనమిక్ హబ్‌గా 

గాజా సముద్ర తీర ప్రాంతాన్ని విలాసవంతమైన పర్యాటక కేంద్రం(Gaza peace plan) గా మార్చాలని కుష్నర్ ప్రతిపాదించారు. ఇందులో అత్యాధునిక నివాస గృహాలు, ఆకర్షణీయమైన బిల్డింగులు, 'స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ల'ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కోస్టల్ టూరిజంను చూపిస్తుంది. ఇందులో 170 రెసిడెన్షియల్ టవర్లు, డేటా సెంటర్లు, ఫ్యాక్టరీలు ఉన్నాయి, వీటిని పార్కులు, వ్యవసాయం క్రీడా సౌకర్యాల ద్వారా విభజించారు. ఎత్తైన భవనాలు, హోటళ్ళు, విలాసవంతమైన విల్లాలను ఏర్పాటు చేయనున్నారు.

కొత్త మౌలిక సదుపాయాలు:

గాజా(Gaza master plan) లో కొత్త విమానాశ్రయం, పెద్ద ఓడరేవు, అధునాతన రహదారులను నిర్మించాలని ప్లాన్ చేశారు. దీని ద్వారా గాజా జీడీపీని 10 బిలియన్ డాలర్లకు పెంచవచ్చని ఆయన అంచనా వేశారు. ఇందులో బీచ్ వెంబడి అభివృద్ధి మరియు ఇతర విలాసవంతమైన భవనాలు కూడా ఉన్నాయి.
రక్షణ, నిరాయుధీకరణ: ఈ పునర్నిర్మాణం విజయవంతం కావాలంటే గాజాను పూర్తిస్థాయిలో ఉగ్రవాద రహితంగా మార్చాలని కుష్నర్ స్పష్టం చేశారు. హమాస్ ఆయుధాలను వీడాలని, సెక్యూరిటీ బాధ్యతలను అమెరికా మద్దతు ఉన్న పాలస్తీనా కమిటీ (NCAG) పర్యవేక్షిస్తుందని తెలిపారు.

Also Read :  డీల్ ను ఒప్పుకోవడానికి 15 ని. మాత్రమే టైమ్..డెన్సీ రోడ్రిగ్జ్‌ వీడియో లీక్‌

బోర్డ్ ఆఫ్ పీస్ 

అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్' ఈ ప్లాన్ బ్యాక్‌బోన్‌గా ఉంది. ఈ బోర్డులో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మాజీ యూకే ప్రధాని టోనీ బ్లెయిర్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా సభ్యులుగా ఉన్నారు. దావోస్ సదస్సులో దాదాపు 19 దేశాల ప్రతినిధులు ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. గాజా అద్భుతమైన ఆస్తి. అక్కడి ప్రజలకు గొప్ప ఉపాధి, ఉజ్వల భవిష్యత్తును అందించే సామర్థ్యం ఈ ప్లాన్‌కు ఉందని జారెడ్ కుష్నర్ అన్నారు.

ఎదురవుతున్న సవాళ్లు

ఈ ప్రణాళికపై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ వాదనలు వస్తున్నాయి. కొందరు దీనిని ఒక గొప్ప ఆర్థిక అవకాశంగా చూస్తుండగా, మానవ హక్కుల సంఘాలు,  పాలస్తీనా మద్దతుదారులు విమర్శిస్తున్నారు. గాజా ప్రజలను ఎక్కడికి తరలిస్తారనేది స్పష్టత లేకపోవడం, ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణపై సందిగ్ధత ఉండటంతో ఈ 'మాస్టర్ ప్లాన్' అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా స్తంభింపజేసిన ఆస్తుల నుండి 1 బిలియన్ డాలర్లను గాజా పునర్నిర్మాణానికి కేటాయించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు