🔴Maha Ganapati Nimajjanam 2025 LIVE: మహా గణపతి శోభాయాత్ర లైవ్ అప్ డేట్స్
నేడు ఓల్డ్ సిటీ నుంచి హుస్సాన్ సాగర్ వరకు జరగనున్న గణేశ్ శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 30 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
Ganesh Immersion: గణేష్ నిమజ్జన కార్యక్రమంపై సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
గణేష్ నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. రికార్డుల ప్రకారం ఇప్పటిదాకా 12,030 విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇంకా 4500 పెద్ద విగ్రహాల నిమజ్జనం జరగాల్సి ఉంది.
Khairatabad Ganesh: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం - Exclusive Photos
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అశేష జనవాహిని మధ్య శోభాయాత్ర ట్యాంక్ బండ్‌కు చేరింది. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం నిర్వహించారు. వేలాది మంది భక్తులు జై గణేశా, జై జై గణేశా అంటూ నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
CM Revanth: పోలీసులకు షాక్.. భక్తులకు సర్ప్రైజ్.. ట్యాంక్‌బండ్ వద్ద సీఎం రేవంత్ సందడి
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద వినాయకుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. వందలాది గణేషుని విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అకస్మాత్తుగా ట్యాంక్‌వద్ద ప్రత్యక్షమయ్యారు.
Khairatabad Ganesh Nimajjanam 2025 Minute To Minute🔴LIVE : గణేష్ శోభాయాత్ర | Ganesh Immersion | RTV
Ganesh Nimajjanam: గణపతి నిమజ్జనం రోజు వర్షం పడటం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో మీకు తెలుసా?
వినాయక చవితి, నిమజ్జనం నాడు వాతావరణంలో మార్పుల వల్ల వర్షం పడుతుందని పలువురు అంటున్నారు. మరికొందరు గణపతి వెళ్లిపోతూ బాధతో కన్నీరు పెడతారని, ఆ కన్నీళ్లే వర్షం రూపంలో భూమిపై పడతాయని పలు పురాణాలు చెబుతున్నాయి.
Ganesh Visarjan 2025: గణేశ్ నిమజ్జనం తర్వాత ఈ పని చేయండి.. ఏడాదంతా మీకు ఆనందం, లాభమే..!
సెప్టెంబర్ 6, 2025న అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం జరగనుంది. ఇళ్లలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలను నిమజ్జన చేసిన జలాన్ని జిల్లేడు, తులసి మొక్క దగ్గర పోస్తే శుభం కలుగుతుంది. కలశంలోని కొబ్బరికాయ నదిలో నిమజ్జనం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
Hyderabad Ganesh Nimajjanam: 40 గంటల పాటు.. 2 లక్షలకు పైగా గణపతులు నిమజ్జనం.. ఒక్క ట్యాంక్‌బండ్‌లో ఎన్నంటే?
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్లో నేడు 40 గంటల పాటు నిమజ్జనాలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 2 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనాలు జరిగాయని తెలిపారు. నేడు ట్యాంక్ బండ్లోనే 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు.