Fire accident: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. హాస్పిటల్ సెల్లార్‌లో భారీ అగ్నిప్రమాదం

వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు కొరిటిపాడు గణేష్ నిమర్జనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ కారణంగా ముగ్గురు సృహతప్పి పడిపోయారు.

New Update
Ganesh immersion in Guntur

వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు కొరిటిపాడు గణేష్ నిమర్జనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ కారణంగా ముగ్గురు సృహతప్పి పడిపోయారు. వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ సెల్లార్‌లో వినాయక విగ్రహం ప్రతిష్టించారు. సెల్లార్‌లో పెట్టిన దీపావళి మందుగుండు సామగ్రిపై కాల్చిన టపాసులు పడటంతో ప్రమాదం జరగవచ్చన స్థానికుల అభిప్రాయ పడుతున్నారు.

దీంతో ఆ మంటలు జెనరేటర్‌కు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో జెనరేటర్‌ పూర్తిగా కాలిపోయింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisment
తాజా కథనాలు