Ganesh Visarjan 2025: గణేశ్ నిమజ్జనం తర్వాత ఈ పని చేయండి.. ఏడాదంతా మీకు ఆనందం, లాభమే..!

సెప్టెంబర్ 6, 2025న అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం జరగనుంది. ఇళ్లలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలను నిమజ్జన చేసిన జలాన్ని జిల్లేడు, తులసి మొక్క దగ్గర పోస్తే శుభం కలుగుతుంది. కలశంలోని కొబ్బరికాయ నదిలో నిమజ్జనం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.

author-image
By Vijaya Nimma
New Update
Ganesh immersion

Ganesh immersion

వినాయక చవితి తర్వాత పది రోజుల పాటు పూజలందుకున్న గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళి, నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనిని వినాయకుడి వీడ్కోలు వేడుకగా భావిస్తారు. ఈ నిమజ్జనం పండుగ సంతోషం, ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలతో గణపతి విగ్రహాలను తరలిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. ఇది ప్రకృతిలో కలిసిపోయే తత్వాన్ని సూచిస్తుంది. విగ్రహం మట్టితో తయారై తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. దీనిని పర్యావరణ పరిరక్షణకు కూడా సంకేతంగా చూస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని, సుఖశాంతులు కలగాలని వేడుకుంటూ వినాయకుడిని సాగనంపుతారు. అయితే సెప్టెంబర్ 6, 2025న అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం జరగనుంది. ఈ రోజున భక్తులు తమ ఇళ్లలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే ఇంట్లో వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అనంత చతుర్దశి రోజున చాలా మంది తమ ఇళ్లలోనే ఒక పాత్రలో నీరు తీసుకొని వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. అయితే ఆ నిమజ్జన జలాన్ని ఎక్కడబడితే అక్కడ పారవేయడం వల్ల అశుభం కలుగుతుందని నమ్మకం. ఈ నిమజ్జన జలాన్ని తులసి మొక్క లేదా జిల్లేడు మొక్కలో పోయాలని సూచిస్తున్నారు. వినాయక నిమజ్జనం తర్వాత చేయాల్సిన పనుల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

గణపతి నిమజ్జనం తర్వాత గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

జిల్లేడు మొక్క: జిల్లేడు మొక్కలో గణేశుడు ఉంటాడని నమ్మకం. ఈ మొక్కలో నిమజ్జన జలాన్ని పోయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, సమృద్ధి ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతారు.

తులసి మొక్క: తులసి మొక్కలో నిమజ్జన జలాన్ని పోయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై.. దరిద్రం తొలగిపోతుందని విశ్వాసం. అంతేకాకుండా లక్ష్మీ-గణేశుల ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయని చెబుతారు.

జాగ్రత్తలు: గణపతి పూజలో వెలిగించిన దీపం యొక్క వాదులను చెత్తబుట్టలో వేయకూడదు. వాటిని పవిత్రమైన నదిలో కానీ, ప్రవహించే నీటిలో కానీ వేయాలి లేదా తులసి మొక్క దగ్గర మట్టిలో పాతిపెట్టాలి.

ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జన సమయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

కలశంలోని కొబ్బరికాయ: వినాయక నిమజ్జనం తర్వాత కలశంలోని కొబ్బరికాయను ప్రసాదంగా స్వీకరించవచ్చు. నదిలో నిమజ్జనం చేయవచ్చు లేదా ఏదైనా చెట్టు మొదట్లో పాతిపెట్టవచ్చు.సెప్టెంబర్ 6న ఉదయం 7:36 నుంచి 9:10 వరకు, మధ్యాహ్నం 12:19 నుంచి 5:02 వరకు, సాయంత్రం 6:37 నుంచి రాత్రి 8:02 వరకు గణపతి నిమజ్జనానికి శుభ సమయాలు మంచిగా ఉందని పండితులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చదవండి: గణేశుడి నిమజ్జనానికి 5 శుభ ముహూర్తాలు ఇవే!

Advertisment
తాజా కథనాలు