Ganesh Immersion Accident: షాకింగ్ వీడియో.. గణేష్ నిమజ్జనంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 9 మంది స్పాట్ డెడ్

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఊరేగింపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
karnataka hassan ganesh immersion accident

karnataka hassan ganesh immersion accident

దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ప్రజలు, భక్తులు కన్నుల పండువగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. డ్యాన్సులు, పాటలు, అన్నదాన కార్యక్రమాలతో హోరెత్తించారు. కొందరు మూడు రాత్రులు, మరికొందరు 5 రాత్రులు, ఇంకొందరు ఏడు, తొమ్మిది, పదకొండు.. ఇలా తమ భక్తితో గణపయ్యను పూజించారు. అయితే నిమజ్జనం సమయంలో భక్తులు, ప్రజలు డ్యాన్సులతో హోరెత్తించగా.. మరికొన్ని చోట్ల ఘోరమైన ప్రమాదాలు ఆనందాన్ని విషాదంగా ముగించాయి. 

karnataka hassan ganesh immersion accident

తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. శుక్రవారం రాత్రి కర్ణాటకలోని హసన్‌లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ప్రజలు, భక్తులు ఫుల్ జోష్‌లో ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. అదే సమయంలో ఒక కంటైనర్ అత్యంత వేగంగా వచ్చి.. ఉరేగింపులోకి దూసుకెళ్లింది. ఈ ఘోరమైన సంఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. అదే సమయంలో మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని HIMS ఆసుపత్రిలో చేర్పించామని.. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని హసన్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఇది కాకుండా మరో 7 మందికి చికిత్స అందిస్తున్నారని.. వారి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఒక బైక్ అని అంటున్నారు. శుక్రవారం రాత్రి మోసలే హొసల్లిలో బైక్‌ను ఢీకొట్టకుండా ఉండటానికి ఆ కంటైనర్ ఊరేగింపులోకి దూసుకొచ్చిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. 

ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. హసన్‌లో గణేష్ నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపును లారీ ఢీకొన్న ప్రమాదంలో అనేక మంది మరణించారని, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిసి చాలా బాధపడ్డానని ఆయన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో చెప్పుకొచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. దీంతో పాటు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సంఘటనలో గాయపడిన వారి చికిత్స ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు.

Advertisment
తాజా కథనాలు