CM Revanth: పోలీసులకు షాక్.. భక్తులకు సర్‌ప్రైజ్‌.. ట్యాంక్‌బండ్ వద్ద సీఎం రేవంత్ సందడి

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద వినాయకుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. వందలాది గణేషుని విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అకస్మాత్తుగా ట్యాంక్‌వద్ద ప్రత్యక్షమయ్యారు.

New Update
CM Revanth Spotted at Tankbund

CM Revanth Spotted at Tankbund

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద వినాయకుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. వందలాది గణేషుని విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అకస్మాత్తుగా ట్యాంక్‌వద్ద ప్రత్యక్షమయ్యారు. ఎక్కువగా సెక్యూరిటీ లేకుండానే పరిమిత వాహనాలతో సాదాసీదాగా ఆయన అక్కడికి చేరుకున్నారు. క్రేన్ నెంబర్‌ 4,5,6 వద్ద నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భక్తులు, సందర్శకులు నిమజ్జనాలను తిలకించిన అనంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Also Read: తాగుబోతు ఫ్రెండ్స్.. జాతరలో కత్తులతో పొడిచి చంపేశారు..!

నిమజ్జనం ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్‌ హరిచందన సీఎంకు వివరించారు. అలాగే నిమజ్జనం విధుల్లో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేవరకు ఇదే స్పూర్తితో పనిచేయాలన్నారు. భక్తులు కూడా పోలీసుల నిబంధనలను పాటించాలని సూచించారు. 

Also Read: తెలంగాణలో ఘోరం.. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి సూసైడ్ - 2నెలల పసికందు కూడా

Advertisment
తాజా కథనాలు