/rtv/media/media_files/2025/09/06/cv-anand-2025-09-06-21-10-52.jpg)
CV Anand
గణేష్ నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాల నిమజ్జనం విజయవంతంగా పూర్తయినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఇంకా చాలా విగ్రహాల వాహనాలు రోడ్లపై వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే నిమజ్జనాల కోసం హుస్సైన్‌సాగర్ చుట్టూ 40 క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read: ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే ఆర్థిక సాయం.. వెలుగులోకి సంచలన నిజాలు
'' గణేష్ మండపాల నిర్వాహకులు మాకు సహకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రధాన మానిటరింగ్ కేంద్రం నుంచి పరిశీలిస్తున్నాం. శోభయాత్రలో డీజేలు వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం ఉదయం లోపు నిమజ్జనాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నాం. రేపు సెలవు దినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవని భావిస్తున్నాం. రికార్డుల ప్రకారం ఇప్పటిదాకా 12,030 విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యింది. ఇంకా 4500 పెద్ద విగ్రహాల నిమజ్జనం జరగాల్సి ఉంది. ఈసారి నిమజ్జన కార్యక్రమంలో ఐటీ యాప్‌తో పాటు శోభయాత్రలను కవర్ చేసేందుకు 9 డ్రోన్లను వినియోగించామని'' సీవీ ఆనంద్ వెల్లడించారు.
Also Read: పాకిస్తాన్ కరాచీలో ఘనంగా గణేష్ నిమజ్జనాలు.. గణపతి విగ్రహాలతో కళకళలాడుతున్న వీధులు!