/rtv/media/media_files/2025/09/06/ganesh-immersion-2025-09-06-13-15-03.jpg)
Ganesh Immersion
వినాయక చవితి, నిమజ్జనం నాడు తప్పకుండా వర్షం పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే గణపతి నిమజ్జనం రోజు వర్షం పడటం వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. సాధారణంగా జూన్ నెలలో రుతుపవనాలు మొదలు అవుతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాలు పడుతుంటాయి. గణపతి ఉత్సవాలు, నిమజ్జనాలు సరిగ్గా సెప్టెంబర్ నెలకు పూర్తి అవుతాయి. ఈ మాసం వర్షా కాలానికి చివరిది. దీంతో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఉదయం ఎక్కువ మంది వాహనాలతో రాకపోకలు నిర్వహిస్తారు.
వాతావరణంలో మార్పుల వల్ల..
ముఖ్యంగా నిమజ్జనం సమయంలో రోడ్ల మీదకు వస్తుంటారు. దీంతో వాతావరణంలో వేడి శాతం పెరిగి, వాతావరణ పీడనం తగ్గుతుంది. ఇలా వాతావరణ పీడనం తగ్గినప్పుడు, గాలి పైకి వెళ్లి వర్షం పడటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణంలోని తేమ ఆవిరిగా మారి పైకి వెళ్లి నీరు చల్లబడి, మేఘాలుగా మారి వర్షం రూపంలో తిరిగి భూమిపై పడుతుంది. దీనివల్ల నిమజ్జన సమయంలో వర్షం పడుతుందని పలువురు భావిస్తున్నారు. అలాగే వర్ష రుతువు ముగిసి శరత్ రుతువు ప్రారంభమయ్యే సమయంలో ఇలాంటి వాతావరణ మార్పులు కనిపిస్తాయి. దీనిని శరత్ రుతువుకు స్వాగతం పలకడానికి కూడా భావిస్తారు. ఈ క్రమంలో కూడా నిమజ్జనం రోజు వర్షం పడుతుందని తెలుస్తోంది.
గణేశుడి కన్నీళ్లు వల్ల..
తొమ్మిది రోజుల పాటు గణపయ్య పూజలు అందుకున్నారు. నిమజ్జనం రోజు భక్తులను వదిలి వెళ్లేటప్పుడు బాధతో కన్నీరు పెడతాడని కొందరు భక్తులు నమ్ముతారు. ఆ కన్నీళ్లే వర్షం రూపంలో భూమిపై పడతాయని పలు పురాణాలు చెబుతున్నాయి. వర్షం పడటం వల్ల మళ్లీ వచ్చే ఏడాది కలుస్తానని హామీ ఇచ్చే సంకేతంగా భక్తులు భావిస్తారు. వర్షం అంటే పవిత్రతకు, శుద్ధికి చిహ్నం. వర్షం ద్వారా అంతా శుభప్రదం అని భావిస్తారు. అయితే నిమజ్జనం సమయంలో వర్షం పడటం వల్ల గణపతి తిరిగి తన లోకానికి వెళ్లే ముందు ప్రకృతిని శుద్ధి చేసి వెళ్తాడని కొందరు నమ్ముతారు. అలాగే ప్రకృతి కూడా గణపతిని తిరిగి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఆయనకు వీడ్కోలు చెబుతున్నట్లుగా వర్షం పడుతుందని పలువురు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.