Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లోని ఓ టైలరింగ్ షాప్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పేశారు. ఆ కుటుంబ సభ్యులు అగ్నిప్రమాదపు పొగ పీల్చుకొని మృతి చెందినట్లు సమాచారం.