Fire Accident : హైదరాబాద్‌లో మరో రెండు భారీ ఫైర్ యాక్సిడెంట్!

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ మొఘల్‌కా నాలా దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. కార్వాన్ రోడ్డులోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

New Update
Parawada Pharma City

Fire Accident

TS News: హైదరాబాద్‌లో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక ఘటన మరువకుందే మరొక ఘటన చోటు చేసుకుంటూ భాగ్యనగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. గుడిమల్కాపూర్‌ మొఘల్‌కా నాలా దగ్గర పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్వాన్ రోడ్డులోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో మంటలతోపాటు దట్టంగా నల్లటి పొగ ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. పొగతో  తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం కావడంతో మంటలు ఎక్కువగా అంటుకున్నాయి.

Also read: మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు

ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం..

ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.  ప్రమాద సమయంలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షాక్ షర్క్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తెలుస్తోంది. గుడిమల్కాపూర్ నాలా దగ్గర అగ్నిప్రమాదం వల్ల భారీ ట్రాఫిక్ జామైంది. వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!

మరో ప్రమాదం:

సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో జరిగింది. ఈ రోజు ఉదయం పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగింది.  మంటలు చూసిన కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.  అయితే.. రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ జరుగుతుండగా మంటలు చెలరేగినట్లు సమాచారం తెలుస్తోంది.  ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. రియాక్టర్ పేలుడుతో పారిశ్రామిక వాడతోపాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: పండ్ల రసాల్లో రసాయనాలు ఎలా గుర్తించాలి?

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

Advertisment
తాజా కథనాలు