రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 200ల బైకులు దగ్ధం, వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాంట్ రైల్వేస్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో ఉన్న 200లకు పైగా బైకులు, స్కూటర్లు దగ్ధం అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్లాట్‌ఫారమ్ వన్ పార్కింగ్ స్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Varanasi

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో ఉన్న 200లకు పైగా బైకులు, స్కూటర్లు దగ్ధం అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్లాట్‌ఫారమ్ వన్ పార్కింగ్ స్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలిసింది.

వెంటనే ఈ విషయం తెలియడంతో 6 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంలో వాహనాలు పూర్తిగా కాలిపోవడంతో వాహన యజమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమను ఎవరు ఆదుకుంటారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రైల్వే అధికారుల స్పందన

Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం

ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసు (జిఆర్‌పి) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయని వారు తెలిపారు. 

Also Read: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

అయితే అప్పటికే చాలా వాహనాలు బూడిదయ్యాయని అన్నారు. ఈ ఘటనపై అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ లాల్జీ చౌదరి విచారం వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగుల కోసం పార్కింగ్ స్టాండ్ ఏర్పాటు చేశామని, అగ్నిప్రమాదం వల్ల చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు.

Also Readకుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి

అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని చౌదరి తెలిపారు. కాగా స్టేషన్‌లోని అసిస్టెంట్ లోకో పైలట్‌లలో ఒకరైన రవి రంజన్ కుమార్ వాహనం కూడా మంటల్లో దగ్దం అయిపోయింది. దీనిపై ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం తాను తన డ్యూటీకి వెళ్ళినప్పుడు తన వాహనాన్ని అక్కడ పార్క్ చేసానని తెలిపారు. అయితే తాను తిరిగి వచ్చేసరికి తన వాహనం కాలిపోయి కనిపించిందని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు