/rtv/media/media_files/2024/12/02/2KmhlQXktZ1K5mvaBULR.jpg)
సుప్రీంకోర్టులో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యురిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని కోర్టు వర్గాలు తెలిపాయి.
Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం
ఈ అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరికీ ప్రమాదం జరగలేదని పేర్కొన్నాయి. ఈ స్వల్ప ప్రమాదం వల్ల 12వ నంబర్ గదిలో సోమవారం జరగనున్న విచారణలు నిలిపివేసింది. అయితే ఒక్కసారిగా ఇలా సుప్రీంకోర్టులో మంటలు చెలరేగడంతో అక్కడికి వచ్చినవాళ్లు ఆందోళనకు గురయ్యారు. పొగ రావడం వల్ల ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పరిస్థితులు వెంటనే అదుపులోకి వచ్చాయి.
Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు
ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇళ్లల్లోనే కాకుండా పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా షార్ట్ సర్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇళ్లల్లో గానీ, ఆఫీసుల్లో గాని విద్యత్‌పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న సమస్య వచ్చినా రిపేర్లు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా
Also Read: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలన్న దీదీ