Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ దగ్గర ఉన్న ఆటోమొబైల్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

New Update
fire  accident

Fire Accident

TG News : హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూసఫ్‌గూడలోని హైదరాబాద్ బిర్యాని హౌస్ దగ్గర ఉన్న ఆటోమొబైల్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దుకాణంలో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో అగ్నికి ఆటోమొబైల్ షాపులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో షాపులో ఎవరూ లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 

Also Read :  గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్.. అతని అల్లునిపై కూడా..

తప్పిన ప్రాణ నష్టం

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటోమొబైన్‌ షాపులో షార్ట్​ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దుకాణాలు మంటలు భారీ ఎత్తున వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. 

 ఇది కూడా చదవండి: ఫుడ్‌ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి?

ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటల ధాటికి అక్కడే ఉన్న వాహనాలతోపాటు ఇళ్లు కూడా  దగ్ధమైయ్యాయా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున నష్టం జరిగినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. షాపులో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న యజమాని ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపులో మంటలు చూసి తీవ్ర అవేదనకు గురైయ్యారు. షాపులో లక్షల విలువ సామాగ్రి  మంటల్లో దగ్ధం కావటంతో ప్రభుత్వం అదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్‌

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఇష్టమైన పండు..ఇది తింటే రోగాలు పరార్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు