Fire Accident: హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఐదంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఒక్కసారిగా మంటలు: వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగలోకి దిగారు. ఘటనాస్థలికి చేరుకుని.. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ బిల్డింగులో అగ్ని ప్రమాదం. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.#Hyderabad #hitechcity #sattvabuilding #firebrokeout #RTV pic.twitter.com/SO2JNkbRm9 — RTV (@RTVnewsnetwork) December 21, 2024 ఇది కూడా చదవండి: చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఏమవుతుంది? ఇది కూడా చదవండి: రోజులో ఎన్ని వాల్‌నట్‌లు తినాలి?..ప్రయోజనమేంటి? ఇది కూడా చదవండి: చలికాలంలో చేతికి గ్లౌజులు వేసుకుని నిద్రిస్తే.. మీ పని ఖతం