Fire Accident: జమ్ముకశ్మీర్‌‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

జమ్మూకశ్మీర్‌లోని కథువాలో రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం కావడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
Jammugvd

జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శివనగర్‌లోని ఓ రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఆరుగురు మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా..

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆపే ప్రయత్నం చేశారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు