Electric shock : చిత్తూరులో దారుణం.. విద్యుత్ ఘాతానికి నాలుగేళ్ల బాలుడు మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో ఘోరం జరిగింది. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆవరణంలో ఆడుకుంటున్న రత్న కుమార్ నాలుగేళ్ల కుమారుడు గజముఖన్ కు విద్యుత్ షాక్ తగిలింది. అక్కడే పడిపోయిన బాలున్ని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు తేల్చారు.