/rtv/media/media_files/2025/08/18/ramantapur-current-shock-2025-08-18-20-33-29.jpg)
Ramantapur Current Shock
Crime News: హైదరాబాద్ రామాంతాపూర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్థరాత్రి శ్రీకృష్ణుడి రథానికి కరెంట్ షాక్ తగిలిన ఘటనలో ఆరుగురు మరణించిన ఘటన అందరినీ కలిచివేసింది. అప్పటి వరకు ఆనందంతో కేరింతలు కొడుతూ రథయాత్రలో పాలు పంచుకున్న యువకులు ఒకసారిగా విఘతజీవులుగా పడి ఉండటం అక్కడున్నవారందరినీ కలిచి వేసింది. అసలు రథానికి కరెంట్ షాక్ ఎలా తగిలిందనే విషయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
స్థానికులు, ప్రత్యక్షసాక్షులు చెబుతున్న దాన్ని బట్టి ఆగస్టు 17 అర్థరాత్రి 12 గంటల సమయంలో రామాంతాపూర్‌లోని గోకుల్ నగర్ లో శ్రీకృష్ణుడి శోభయాత్ర నిర్వహించారు. అక్కడి యువకులంతా ఎంతో ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర ముగిసిన అనంతరం రథాన్ని తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రథాన్ని లాగేందుకు ఉపయోగించిన జీపు మొరాయిచింది. దాన్ని ఎంత ప్రయత్నించిన బాగు కాకపోవడంతో యువకులు స్వయంగా రథాన్ని లాక్కూని వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హై టెన్షన్ వైర్ల కింద నుంచి రథాన్ని లాక్కొని వెళ్తున్న క్రమంలో ఆ వైర్ల నుంచి ఒక వైరు కిందకు వేలాడడాన్ని ఎవరూ గమనించలేదు. అయితే రథం ఆ తీగకు తాగడంతో ఒకసారిగా రథానికి కరెంట్ షాక్ వచ్చింది. రథానికి వైరు తగలగానే నిప్పురవ్వలు ఎగిసిపడడంతో పాటు రథాన్ని లాగుతున్నవారికి షాక్ తగిలి ఒక్కసారిగా పడిపోయారు. అనుకోని ఘటనతో అక్కడ ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు.
ఇది కూడా చూడండి: Rahul Sipligunj Engagement: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
అయితే రథం పై ఉన్న పూజారికి మరికొంతమందికి ఏం జరగనప్పటికీ రథం లాగుతున్నవారికి మాత్రమే షాక్ తగిలినట్లు తెలుస్తోంది.దీంతో సంఘటనస్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. మరోకరు ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. అయితే కరెంట్ షాక్ తగిలి యువకులు పడిపోవడంతో అక్కడున్న వారంతా వారిని సీపీఆర్ చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు.కానీ లాభం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించేలోపే ఐదుగురు చనిపోవడంతో స్థానికంగా రోదనలు మిన్నంటాయి. తీవ్రంగా గాయపడ్డ మరికొందరికీ యశోద, కేర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన అందరూ 40 సంవత్సరాల లోపువారే కావడం గమనార్హం. కాగా, విద్యుత్‌వైరు వేలాడటం వల్లే ప్రమాదం జరిగిందని, విద్యుత్ అధికారలు నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement Photos: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు చూశారా.. జోడీ ఎంత బాగుందో?