Electric shock : చిత్తూరులో దారుణం.. విద్యుత్ ఘాతానికి నాలుగేళ్ల బాలుడు మృతి

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో ఘోరం జరిగింది.  శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆవరణంలో ఆడుకుంటున్న రత్న కుమార్ నాలుగేళ్ల కుమారుడు గజముఖన్ కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. అక్కడే పడిపోయిన బాలున్ని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు తేల్చారు.

New Update
Electricity shock

Electricity shock

Electric shock : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో ఘోరం జరిగింది.  శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆవరణంలో ఆడుకుంటున్న రత్న కుమార్ నాలుగేళ్ల కుమారుడు గజముఖన్ కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. 

Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

రేకుల షెడ్డు కు ఏర్పాటుచేసిన ఇనుప పైపు పట్టుకుని ఆడుకుంటుండగా విద్యుత్‌ సరఫరా అయి విద్యుత్ ఘాతానికి  గురయ్యాడు. అక్కడే పడిపోయిన బాలున్ని గుర్తించిన స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలున్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆలయ ఆవరణంలో ఆడుకుంటూ అభం శుభం తెలియని చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి వేప చెట్టును నరికి వేయడంతో చెట్టు కొమ్మలు విద్యుత్‌ లైన్‌ రేకుల షెడ్డు మీదపడి విద్యుత్ ఘాతంతో బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. విద్యుత్  షాక్‌ గురైన బాలుడి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాగా ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించిన బాలున్నిచూడడానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నాలుగేళ్ల కుమారుడు చలనం లేకుండా పడి ఉండడం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కాగా బాలుని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Also Read: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ

Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు