BREAKING: కృష్ణాష్టమి వేడుకలో తీవ్ర విషాదం.. ఊరేగింపులో ఐదుగురు మృతి

హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘోర విషాదాన్ని నింపింది. రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

New Update
Sri Krishna Ashtami celebrations

Sri Krishna Ashtami celebrations

హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘోర విషాదాన్ని నింపింది. రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం రిపేర్ అవ్వడంతో యువకులు దాన్ని పక్కన నిలిపారు. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్‌ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు.

ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకొని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్‌ (21), సురేశ్‌ యాదవ్‌(34), శ్రీకాంత్‌రెడ్డి(35), రుద్రవికాస్‌(39), రాజేంద్రరెడ్డి(45) ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్‌ శ్రీనివాస్‌ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. 
,

Advertisment
తాజా కథనాలు