/rtv/media/media_files/2025/08/18/ramantapur-current-shock-2025-08-18-20-33-29.jpg)
Ramanthapur electric shock
Electrocution: రామంతపూర్ లో సోమవారం తెల్లవారు జామున జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో విద్యుత్ షాక్ కు గురై ఆరుగురు మృతి చెందిన ఘటనపై మానవ హక్కుల సంఘం (హెచ్ ఆర్ సీ) సీరియస్ అయింది. సుమోటోగా కేసు స్వీకరించిన HRC ఘటనకు గల కారణం, అధికారుల నిర్లక్ష్యం, తక్షణ పరిష్కార చర్యలు, బాధితుల కుటుంబాలకు పరిహారం.. భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22 వ తేదీ లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని TSSPDCL సీఎండీ కి ఆదేశాలు జారీ చేసింది.
కాగా రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనపై ఈ మేరకు విద్యుత్ శాఖ సీఎండీ స్పందించారు. రామంతాపూర్ ఘటన బాధాకరమన్న ఆయన ..కేబుల్ వైర్ల వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాధమిక అంచనాకు వచ్చామన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం..డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చించి మృతులకు, గాయాలైన వారికి నష్టపరిహారం విషయంపై చర్చిస్తామని అన్నారు. అయితే రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన విద్యుత్ శాఖ సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి వదిలేది లేదని పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అధికారులు సర్ధి చెప్పడం గొడవ సద్దుమణిగింది.
కేబుల్ వైర్లను తొలగించండి..భట్టి ఆదేశం
మరోవైపు విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలకు టీవీ, ఇంటర్నెట్ కేబుళ్ల (వైర్లు) ఏర్పాటులో నిర్లక్ష్యంతో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా హైదరాబాద్ రామంతాపూర్‌లో ఐదుగురి మృతికి రోడ్డుకు అడ్డంగా లాగిన కేబుల్ తెగి విద్యుత్‌లైనుపై పడటమే కారణమని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో అటువంటి వైర్లను తొలగించాలని ఆదేశించారు. అలాగే అనుమతులు లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఉన్నా వెంటనే తొలగించాలని ఆదేశించారు. అయితే కేబుల్ వైర్లు తొలగించాలని ఏడాది సమయం ఇచ్చినా సంబంధిత ఆపరేటర్లు స్పందించలేదని భట్టి మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ అధికారుల్లో కదలిక
ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు ఇప్పుడు అదే తీరు ప్రదర్శించారు. వరుసగా ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. రామాంతాపూర్, పాతబస్తీ, బండ్లగూడలో విద్యుత్ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కరెంటు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను అధికారులు తొలగిస్తున్నారు. ఉప్పల్, రామాంతాపూర్, చిలకానగర్‌లలో విద్యుత్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలిని, పిల్లలను వాటి వద్దకు వెళ్లనివ్వ వద్దని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. వర్షాలు పడే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ డివిజన్‌లలో కరెంటు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను అధికారులు తొలగించే పనిలో పడ్డారు.
Also Read : Janhvi Kapoor Photos: అబ్బా ! లెహంగాలో 'పరమ్ సుందరి' ఫోటోషూట్ అదిరింది.. కుర్రకారు ఫిదా!