/rtv/media/media_files/2025/04/06/AZHTX6zAJbE9zTVUg2ex.jpg)
electric shock
తన ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఇద్దరు కార్మికుల పై ఆ యజమాని దారుణంగా ప్రవర్తించాడు. దొంగనతం చేశారని ఆరోపిస్తూ వారిని చిత్ర హింసలకు గురిచేశాడు. వాళ్ల గోళ్లను తొలగించి విద్యుత్ షాక్ ఇచ్చాడు.ఈ అమానవీయ ఘటన చత్తీస్‌గఢ్ లో చోటు చేసుకుంది.
Also Read: The Family Man Season 3: IPL తర్వాత 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'.. ఫ్యాన్స్ కు పండగే!
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ..ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఉన్న ఒక ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగులకు పని చేస్తున్నారు.అయితే..ఫ్యాక్టరీలో దొంగతనం చేశారని ఆరోపిస్తూ యజమాని చోటూ గుర్జార్ తన సహాయకుడితో కలిసి వీరిద్దరి పై దాడి చేశాడు.
Also Read: IPL 2025: 14 ఏళ్ళకే ఐపీఎల్ ప్రవేశం..చరిత్రలో నిలిపోయే వైభవ సూర్యవంశీ
అంతేకాకుండా వారిని అర్థనగ్నంగా నిలబెట్టి చితకబాదాడు.వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తరువాత ఆ ఇద్దరు బాధితులు అక్కడి నుంచి తప్పించుకుని తమ స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ తరువాత సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో తమ యజమాని,అతడి సహాయకుడి పై ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆ తరువాత కోర్బా పోలీస్ స్టేషన్ లో యజమాని పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.కొన్ని అవసరాల నిమిత్తం మా యజమాని ఛోటూను రూ.20 వేలను ఇవ్వాలని కోరాం. కానీ మా అభ్యర్థనను అతడు తిరస్కరించాడు.డబ్బు ఇవ్వకపోతే ఉద్యోగం వదిలి వెళ్లిపోతామని హెచ్చరించాం.దీంతో మా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆగ్రహానికి గురైన యజమాని మా పై దాడి చేశాడు.తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశాడని బాధితుడు తెలిపాడు.
Also Read: Madhya Pradesh: విద్యార్థులకు మద్యం తాగించిన ఉపాధ్యాయుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే...
Also Read: Maoist: చరిత్రలో తొలిసారి.. సుక్మా జిల్లాలో నక్సల్స్ రహిత గ్రామం.. కోటి రూపాయల విరాళం!
chhattisgarh | latest-news | electric-shock | labourers | labour | labour-work | telugu-news | latest-telugu-news | latest telugu news updates