High Court: ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా విద్యుత్ కేబుల్ వైర్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కేబుల్ వైరు తగిలి ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మరునాడే వినాయకుడిని తీసుకెళ్తున్నవారు ఇలాగే ప్రమాదానికి గురై చనిపోయారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యుత్ అధికారులు నగర వ్యాప్తంగా కేబుల్ వైర్లను తొలగిస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇంటర్‌నెట్, టీవీ కనెక్షన్‌లు నిలిచిపోయాయి. ఈ అంశంపై భారతి ఎయిర్‌టెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.
Also Read: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా?
కాగా కేబుల్ వైర్లు ఏర్పాటు చేస్తు్న్న ప్రాంతాల్లో తాము వినియోగించుకుంటున్న విద్యుత్ స్తంభాలకు డబ్బు చెల్లిస్తున్నామని భారతి ఎయిర్‌టెల్ అధికారులు తెలిపారు.ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేబుళ్లు కట్ చేయడం వల్ల ఇంటర్‌నెట్ అంతరాయంతో పలుచోట్ల సేవలు నిలిచిపోయాయని వారు కోర్టుకు తెలిపారు. అయితే ఎయిర్‌టెల్ పిటిషన్‌పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబుళ్లను పునరుద్ధరణ చేయడం పెద్ద సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని జస్టిస్ నగేష్ భీమపాక సూటిగా ప్రశ్నించారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీహెచ్‌ఎంసీ, సర్వీస్ ప్రొవైడర్లు ఎవరికి వారు మేము కాదని చేతులు దులిపేసుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఈ దుర్ఘటనకు అందరూ బాధ్యులే అన్న న్యాయమూర్తి మనుషులంటే కాస్త దయ చూపాలి’’అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చూడండి:తెలంగాణలో కొత్త మద్యం షాపులు.. లైసెన్స్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
వైర్ల తొలగింపుతో ఇంటర్‌నెట్ అంతరాయం ఏర్పాడుతుందని పలుచోట్ల సేవలు నిలిచిపోయాయని భారతి ఎయిర్ టెల్ న్యాయవాది చెప్పారు. దీంతో ప్రజల ప్రాణాలే పోతుంటే ఇంటర్‌నెట్ సేవలు ఎందుకని టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది తీవ్రంగా ప్రశ్నించారు. ఒక్కో స్తంభానికి పరిమితికి మించి కేబుళ్లు ఉన్నాయని హై కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్ల తొలగింపుపై టీజీఎస్పీడీసీఎల్, జీహెచ్‌ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు కేబుళ్లు తొలగించవద్దని విద్యుత్ అధికారులను ఆదేశించింది.
ఇది కూడా చూడండి:Crime News: మరో భర్త బలి.. మరిగే నూనె పోసి అతి కిరాతంగా హత్య చేసిన భార్య
High Court: చేతులు దులిపేసుకుంటే ఎలా? అందరూ బాధ్యులే.. విద్యుత్ మృతులపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా విద్యుత్ కేబుల్ వైర్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ వైర్లను తొలగించాలని ఆదేశించింది. దీంతో చాలా చోట్ల ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోయాయి. ఈ అంశంపై భారతి ఎయిర్‌టెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.
Telangana High Court