BIG BREAKING: అయ్యో పాపం.. హైదరాబాద్‌లో యాచకులను బలి తీసుకున్న కరెంట్ తీగలు

హైదరాబాద్‌లోని LBనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్‌ విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనమయ్యారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.

New Update
LB nagar

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున దారుణ చోటుచేసుకుంది. ఎల్‌బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు చింతల్‌కుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్‌ విద్యుత్ తీగలు తెగి పడి అక్కడికక్కడే ఇద్దరు సజీవ దహనమయ్యారు. వారితోపాటు ఓ కుక్క కూడా కాలిబూదిదైంది. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులను యాచకులుగా పోలీసులు భావిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు