/rtv/media/media_files/2025/08/19/bandlaguda-accident-2025-08-19-09-28-24.jpg)
హైదరాబాద్(Hyderabad) రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో(Sri Krishnastami) విషాదం మరువకముందే బండ్లగూడలో మరో అపశ్రుతి చోటుచేసుకున్నది. నవరాత్రుల కోసం వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
While transporting a Ganesha idol in Bandlaguda, a tractor hit high-tension wires. Two youths -Tony (21) & Vikas (20) died of electrocution, another (Akhil) injured & hospitalized. Police investigating. #Hyderabadpic.twitter.com/TXACZoJ4r9
— Ashish (@KP_Aashish) August 19, 2025
Also Read : అఘోరీ ఈజ్ బ్యాక్.. వర్షిణికి షాక్
Two Die Of Electric Shock While Carrying Ganesha Idol
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్ అనే యువకుడిని హాస్పిటల్‌కు తరలించారు. మృతులను టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథంపై శ్రీకృష్ణుడి ఉరేగింపుకి ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఆదివారం రాత్రి వీధుల్లో యాదవ సంఘం భవనం నుంచి శ్రీకృష్ణుడి ఉరేగింపు చేపట్టారు. ఓవైపు వర్షం పడుతుండగా మరోవైపు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి రథయాత్ర కొనసాగింది. ఉరేగింపు దాదాపు పూర్తయి తిరిగి రథాన్ని యాదవ సంఘ భవనం వద్ద పెట్టేందుకు వెళ్తుండగా రథాన్ని ముందుకు లాగుతున్న జీపు ఆగిపోయింది. మరో వంద అడుగుల దూరం ఉండటంతో చేతులతో రథాన్ని తోస్తూ వెళ్లారు. ఆకస్మాత్తుగా రథాన్ని లాగుతున్న వాళ్లు గట్టిగా అరుస్తూ కిందపడిపోయారు. అప్పటికే రథంపై ఉన్న వాళ్లు ఏం జరిగిందో అర్థం కాక పరుగులు పెట్టారు. వేలాడుతున్న విద్యుత్తు తీగ రథానికి తగిలి షాక్ కొట్టింది. దీంతో వెనుక నుంచి తోస్తున్న వాళ్లు 9 మంది అపస్మార స్థితిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు కొందరికి సీపీఆర్ కూడా చేసినా ఫలితం లేకుండాపోయింది. ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురిని చికిత్స కోసం వివిధ దవాఖానాలకు తరలించారు.
Also Read : తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
, ,