దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరీ అనే ఇండియన్ స్టూడెంట్ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్న సూరీ భార్య గాజాకు చెందినది. ఈ కారణంగానే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సూరీ ఆరోపించాడు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 40 నిమిషాలపాటు బిల్‌గేట్స్‌తో చర్చలు జరిపారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్లు ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చంచినట్లు సీఎం తెలిపారు.
ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి కూతురిపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత నేరాన్ని పొరుగింటి వారిపై నెట్టే ప్రయత్నం చేశాడు. విచారణలో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తో కలిసి ఢిల్లీ లో స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడారు. ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్. ఆప్ కీలక నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు పాఠశాల గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు.
ఢిల్లీలోని ఓ హోటల్లో బ్రిటిష్ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి నిందితుడితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడగా.. అతని కోసం ఢిల్లీకి వచ్చింది. బాధితురాలు పోలీసులను సంప్రదించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. లోక్‌సభ సమావేశానికి హాజరైన అనంతరం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. దీంతో కాలికి గాయమైంది.