/rtv/media/media_files/2025/06/24/man-beaten-on-vande-bharat-for-not-giving-seat-to-bjp-mla-2025-06-24-18-51-48.jpg)
Man beaten on Vande Bharat for not giving seat to BJP MLA
Vande Bharat: వందేభారత్ రైలులో దారుణం చోటు చేసుకుంది. సీటు మారేందుకు నిరాకరించాడని ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు చితకబాడడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేను నెటిజన్లు తీవ్రంగా దూషిస్తున్నారు. అయితే ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికుడిపైనే తిరిగి కేసు పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!
ఢిల్లీ నుంచి భోపాల్ వెళుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ గత వారం ఎక్కారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత నియోజకవర్గానికి వందేభారత్‌తో ప్రయాణిస్తున్నారు. అయితే ఆయనకు ఆయన భార్య, కుమారుడికి వేర్వేరు చోట్ల సీట్లు వచ్చాయి. భార్య, కుమారుడికి కంపార్ట్‌మెంట్ ముందు వరుసలో సీట్లు రాగా.. ఎమ్మెల్యేకి వేరే చోట సీటు వచ్చింది. అయితే వారి పక్కన వేరే వ్యక్తికి సీటు వచ్చింది. తన భార్య పిల్లలతో ప్రయాణించాలనుకున్న ఎమ్మెల్యే ఆ ప్రయాణికుడి వద్దకు వెళ్లి సీటు మారాలని సూచించాడు. అయితే దానికి ఆ వ్యక్తి నిరాకరించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!
ఇది జరిగిన కాసేపటికే ఝాన్సీ స్టేషన్ వచ్చింది. స్టేషన్ లో ట్రైన్ ఆగగానే సదరు ఎమ్మెల్యే మనుషులు ట్రైన్ ఎక్కారు. ఎక్కడంతోనే ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆరుగురు వ్యక్తులు ఆ ప్రయాణీకుడిని కూర్చున్న సీట్లోనే ఇష్లమొచ్చినట్లు చెప్పులతో కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి ముక్కు నుంచి రక్తం కారడంతోపాటు, దుస్తులపై రక్తం మరకలతో ఆ వ్యక్తి కనిపించాడు. ఈ విషయమై స్పందించిన రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపుల్ కుమార్ మాట్లాడుతూ సీటు విషయంలో తలెత్తిన వివాదంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కానీ, దెబ్బలు తిన్న వ్యక్తి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయకపోగా.. తన కుటుంబ సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని ఎమ్మెల్యే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఝాన్సీ రైల్వే పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం గమనార్హం.
Also Read: ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం
Follow Us