Hyderabad: బట్టతలపై జుట్టు అనగానే బుట్టలో పడ్డారు...తీరా చూస్తే...

"అయ్యయ్యో ...చేతిలో డబ్బులు పోయెనే..అయ్యయ్యో ...జేబులు ఖాళీ ఆయెనే..ఉన్నది కాస్తా ఊడింది...సర్వ మంగళం పాడింది.' అన్నట్లయింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తామనగానే క్యూ కట్టి మరి డబ్బులు సమర్పించుకున్నారు. 56వేలమంది నుంచి డబ్బులు వసూలు చేసింది సల్మాన్ గ్యాంగ్.

New Update
Bald Head

Bald Head

Hyderabad: "అయ్యయ్యో ... చేతిలో డబ్బులు పోయెనే..అయ్యయ్యో ... జేబులు ఖాళీ ఆయెనే..ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది.' అన్నట్లే అయింది వారి పని. బట్టతలపై జుట్టు మొలిపిస్తామనగానే క్యూ కట్టి మరి డబ్బులు సమర్పించుకున్నారు. ఒక్కరూ..ఇద్దరూ కాదు ఏకంగా 56 వేల మంది క్యూ కట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.1300 వసూలు చేసిన ఆ గ్యాంగ్‌ మొత్తం మీద బట్టతలమీద ఒత్తుగా నూనెరాసి ఉడాయించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

ఢిల్లీకి చెందిన ఒక గ్యాంగ్‌ బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ హైదరాబాద్‌ పాతబస్తీలోని ఖులీకుతుబ్‌ షాహీ స్టేడియంలో  ఓ శిబిరం ఏర్పాటు చేసింది. రెండు రోజులు మాత్రమే శిబిరం ఉంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేశారు. బట్టతలతో పాటు జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుందని, ఒత్తుగా జుత్తు వస్తుందని ఊదరగొట్టారు. దీంతో శని,ఆదివారాల్లో స్టేడియానికి జనం పోటెత్తారు. ఢిల్లీకి చెందిన సల్మాన్‌ స్టార్‌ అలియాస్‌ సల్మాన్‌ ఢిల్లీవాలా పేరుతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. దీనికోసం మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు, కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

Also read: మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం


రిజిస్ట్రేషన్‌ కింద రూ.700, నూనె తలకు రాశాక రూ.600 చొప్పున ఒక్కొక్కరి వద్ద రూ.1300లు వసూలు చేశారు. బట్టతల ఉన్నవారితో పాటు, జుత్తు ఎక్కువగా రాలుతున్న వారు కూడా ఈ శిబిరానికి తరలివచ్చారు. చాలామంది బార్బర్‌ షాపుకు వెళ్లి మరీ పూర్తిగా గుండు చేయించుకుని వచ్చారు. కాగా ఇది  ఒక ప్రత్యేక చెట్టు నుంచి తీసిన తైలమని, దీనిపేరు జడిబుడి తైలమని జనాన్ని నమ్మించారు. దీన్ని జుట్టు కావాల్సిన చోట రాస్తే మూడు నెలల్లో ఒత్తుగా జుట్టు వస్తుందని బురిడీ కొట్టించారు.

Also read:ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?

కాగా ఈ జడిబుడి తైలాన్ని ప్రతి15 రోజులకోసారి 3 నెలల పాటు తీసుకోవాలని సల్మాన్‌ గ్యాంగ్‌ సూచించింది. తద్వారా మూడునెలల్లో ఒత్తుగా జుట్టు రావడం ఖాయమని గ్యారంటీ కూడా ఇచ్చారు. ఇది నమ్మిన జనం వీపరీతంగా తరలివచ్చారు. రెండు రోజుల్లో సుమారు 56 వేలమంది తైలం కోసం క్యూ కట్టారు. అయితే ఇంత జరుగుతున్నా వేలాదిమంది ఒక స్టేడియానికి క్యూ కట్టిన విషయం పోలీసులకు తెలియకపోవడం గమనార్హం.  మొత్తం మీదా ఈ గ్యాంగ్‌ రూ.70 నుంచి రూ.80 లక్షల వరకు వసూలు చేసుకుని తమ పని కానిచ్చుకుని వెళ్లింది. తైలం రాసుకున్న వారికి జుట్టు మొలుస్తుందా లేదా తెలియదు కానీ, ఈ గ్యాంగ్‌ గతంలో ఒకసారి పాతబస్తీ, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఇదే విధంగా ప్రచారం చేసి శిబిరం ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసింది. అయితే జుట్టు మొలవకపోవడంతో బాధితులు ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సల్మాన్‌ గ్యాంగ్‌ మీద కేసు నమోదు చేశారు. తిరిగి అదే గ్యాంగ్‌ స్టేడియంలో శిబిరం ఏర్పాటు చేయడం, వేలాదిమంది జనం పోగవ్వడం జరిగినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం విమర్శలకు తావిస్తోంది.

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

Advertisment
Advertisment
తాజా కథనాలు