/rtv/media/media_files/2025/07/03/fuel-ban-1-2025-07-03-18-35-17.jpg)
Fuel Ban In Delhi:
లైఫ్ టైం ముగిసిన వాహనాలకు పెట్రోల్ బంక్‌ల్లో ఇంధనాన్ని నిషేధిస్తూ ఢీల్లీ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ఈ నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఇంధనం బ్యాన్ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఢిల్లీలో ఇంధనం బ్యాన్ సాధ్యం కావడం లేదని తెలిపింది. వాహన వయసు ప్రకారం స్క్రాప్ చేయలేమని పేర్కొంది. కాలుష్య కారక వాహనాలను మాత్రం సీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇంధనం బ్యాన్ విధిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ సర్కార్ ఉపసంహరించుకుంది.
Also Read: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది
ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిపడాన్ని అనుమతించేది లేదని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. మంగళవారం నుంచి దానిని అమలు చేస్తున్నది. దీనికోసం దేశ రాజధానిలోని 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా సిస్టమ్‌లను ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
Also Read:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !
అదేవిధంగా 100 ప్రత్యేక బృందాలను ఢిల్లీ రవాణా శాఖ నియమించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లకు ఈ నిషేధాన్ని విస్తరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లోని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.