Free Laptops: విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్స్.. కేంద్రం క్లారిటీ

దేశంలో విద్యార్థులందరికీ కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని చెబుతూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ఎక్స్‌లో స్పష్టం చేసింది.

New Update
Laptop

Laptop

సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అయాకులకు సైబర్‌ వల వేసి వారి బ్యాంకు బ్యాలెన్స్‌ను ఖాళీ చేసేందుకు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా మరో కొత్త పన్నగానికి పాల్పడ్డారు. దేశంలో విద్యార్థులందరికీ కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని చెబుతూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. వాళ్లు పంపిన లింక్‌ను క్లిక్‌ చేయాలని అడుగుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదని చెబుతూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ఎక్స్‌లో స్పష్టం చేసింది. 

Also Read:  ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం.. తండ్రిపై కేసు నమోదు

Also Read :  చార్‌ధామ్ భక్తులకు బిగ్ అలర్ట్.. మరోసారి యాత్ర వాయిదా!

Central Government Providing Free Laptops

Also Read: మెడ, ఛాతిపై పదునైన పంటిగాట్లు.. కోల్‌కతా లా విద్యార్థిని మెడికల్ రిపోర్టులో షాకింగ్స్

'' కేంద్రం విద్యార్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్‌లను అందిస్తూ డిజిటలైజేషన్ విద్యను ప్రోత్సహిస్తుంది. మీరు కేంద్రం అందించే ఉచిత ల్యాప్‌టాప్‌ స్కీమ్ కింద ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతను చెక్‌ చేసుకోవాలి'' అని చెబుతూ సైబర్‌ నేరగాళ్లు పింపించే మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మెసేజ్‌ ఫేక్‌ అని, మోసపూరితమైనదని స్పష్టం చేసింది. ఇలా వచ్చే అనుమానస్పద లింక్‌లపై ఎప్పుడూ కూడా క్లిక్‌ చేయొద్దని చెప్పింది. అధికారిక వర్గాల ద్వారా సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని సూచించింది. 

Also Read :  రాత్రి నిద్రలో పదే పదే నీరు తాగుతారా..? ఇది వ్యాధని తెలుసుకోండి..!!

 

cyber-scam | rtv-news | Cyber ​​Crime | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు