HYD Cyber Crime: హైదరాబాద్‌లో వృద్ధుడిని వదలని సైబర్ కేటుగాళ్లు.. రూ.53 లక్షలు ఫసక్

హైదరాబాద్‌కు చెందిన 77ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. మనీలాండరింగ్ జరిగిందని, అరెస్టు వారెంటీ జారీ చేశామని చెప్పడంతో రూ.53లక్షలు పంపించేశాడు. వెంటనే కేటుగాళ్లు కాల్ కట్ చేసి పత్తా లేకుండా పోయారు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

New Update
kodada cyber crime

HYD Cyber Crime

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ పెట్రేగిపోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులను టార్గెట్ చేసి లక్షల్లో దోచేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి డబ్బులు గుంజేస్తున్నారు. ఇప్పటికి అలాంటివి చాలా ఘటనలు జరిగాయి. పోలీసులు వీటిపై అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. 

HYD Cyber Crime

హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడిని సైబర్ కేటుగాళ్లు భయపెట్టారు. మనీలాండరింగ్ కేసు నమోదైందని.. డిజిటల్ అరెస్టు అంటూ వృద్ధుడిని భయపెట్టి అతడి నుంచి రూ.53 లక్షలు కాజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

హైదారాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడికి గత నెల 18న వీడియో కాల్ వచ్చింది. అందులో అవతలి తనను పరిచయం చేసుకున్నాడు. తన పేరు రాజీవ్ కుమార్ అని.. తాను ఢిల్లీ డీసీపీ అని తెలిపాడు. అనంతరం ఆ వృద్దుడిని భయపెట్టాడు. మనీలాండరింగ్ కేసు నమోదు అయిందని.. అందువల్ల మీ పేరుతో అరెస్టు వారెంటీ జారీ చేశామని వృద్ధుడిని భయపెట్టాడు. 

Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!

ఈ కేసు తేలేంతవరకు బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తామని బెదిరించాడు. ఇందులో భాగంగా సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చినట్లు వృద్ధుడిని నమ్మించాడు. దీంతో అవతల వ్యక్తి మాటలకు వృద్ధుడి గజగజ వణికిపోయాడు. తనపై కేసు నమోదు చేయొద్దని కోరాడు. కేసు విషయం తేలేంతవరకు అకౌంట్‌లో ఉన్న డబ్బులను ట్రాన్సఫర్ చేయాలని.. తనిఖీ చేసి తిరిగి పంపించేస్తామని అవతలి వ్యక్తి చెప్పడంతో మొత్తం రూ.53 లక్షలు పంపించేశాడు. 

Also Read : రూ. 20వేలలో బెస్ట్ స్మార్ట్‌టీవీలు - మార్కెట్లో దుమ్మురేపుతున్న మోడల్స్ ఇవే!!

ఇలా డబ్బులు పంపించాడో లేదో.. నేరగాల్లు అలా ఫోన్ కట్ చేసేశారు. దీని తర్వాత అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆ బాధిత వృద్ధుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు