/rtv/media/media_files/2025/06/09/Q67LR5u9NcE0RH71UWfM.jpg)
pib fact check alerts fake Notice on bsnl sim users over kyc suspended
ఈమధ్య సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకొని.. వేలు, లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. అంతేకాదు సైబర్ స్కామ్‌లు చేసేందుకు కొత్త కొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా BSNL సిమ్ వినియోగించే కస్టమర్లను టార్గెట్ చేశారు. వారికికి ఓ ఫేక్ మెసేజ్ పంపించారు. ఇందులో కస్టమర్ల కేవైసీ ట్రాయ్ నిలిచిపోతుందని.. 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందంటూ తప్పుడు సందేశం పంపిస్తున్నారు.
Also Read: అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి
Fake Notice On BSNL SIM Users
ఒక నెంబర్ ఇచ్చి కూడా సాయం కోసం కాల్ చేయాలని ఆ మెసేజ్‌లో చెప్పారు. చివరికీ ఇది ఫేక్ మెసేజ్ అని తేలడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి మెసేజ్‌లు నమ్మకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇది ఫేక్ నోటీసు అని అందులో స్పష్టంగా పేర్కొంది. BSNL ఎప్పుడూ కూడా ఇలా సిమ్ కైవైసీకి సంబంధించి నోటీసులు పంపించద్దని తెలిపింది.
Have you also received a notice purportedly from BSNL, claiming that the customer's KYC has been suspended by @TRAI and the sim card will be blocked within 24 hrs❓#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 9, 2025
❌ Beware! This Notice is #Fake.
✅ @BSNLCorporate never sends any such notices. pic.twitter.com/94W5knnCd6
Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)
ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. ఏదైనా వార్తను నమ్మి, వేరొకరికి షేర్ చేసే మందు అధికారిక వర్గాల నుంచి వెరిఫై చేసుకోవాలని ప్రజలు సూచనలు చేసింది.
Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్
Also Read: కేరళ కోజికోడ్ తీరంలో భారీ ప్రమాదం.. నలుగురు సిబ్బంది గల్లంతు
telugu-news | rtv-news | Cyber Crime