Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!
ఎక్స్ పై భారీ సైబర్ దాడి జరిగిందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోస్టు కూడా చేశారు. మేము ప్రతిరోజు సైబర్ దాడికి గురవుతున్నాం. అయితే ప్రస్తుతం జరిగిన దాని వెనుక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్ లేదా ఒక దేశ హస్తం ఉంది అంటూ పేర్కొన్నారు.