Typhoon Cyberattacks: చైనా చేతిలో అమెరికా రహస్యాలు.. భయంతో వణికిపోతున్న ట్రంప్

అమెరికా భద్రతకు చైనా నుంచి పెను ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల "సాల్ట్ టైఫూన్" అనే సైబర్ దాడులు అమెరికా ప్రభుత్వ సంస్థలు, వార్తా సంస్థలు, విశ్వవిద్యాలయాలని లక్ష్యంగా చేసుకుని జరిగాయని, దీని వెనుక చైనా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

New Update
Typhoon cyberattacks

Typhoon Cyberattacks

Typhoon Cyberattacks: 

అమెరికా సైబర్‌ భద్రతకు(American Cybersecurity) చైనా(China) నుంచి పెను ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల "సాల్ట్ టైఫూన్" అనే సైబర్ దాడులు అమెరికా ప్రభుత్వ సంస్థలు, వార్తా సంస్థలు, విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకుని జరిగాయని, దీని వెనుక చైనా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ దాడుల ద్వారా బీజింగ్ అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిందని, ఇది తమ నిఘా సంస్థలకు కీలకమైందని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

"సాల్ట్ టైఫూన్" హ్యాకర్ల ముఠా 2019 నుంచి దాదాపు 80 దేశాల్లోని 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని నిపుణులు తెలిపారు. ఈ దాడుల ద్వారా ప్రతి అమెరికన్ పౌరుడికి సంబంధించిన డేటా సేకరించి ఉండే అవకాశం ఉందని వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ప్రభుత్వమే ఈ హ్యాకర్ల ముఠాకు నిధులు అందిస్తోందని, గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్, ఆర్మీ మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ టార్గెట్‌గా చేసుకుంటున్నారని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.

Also Read: సంచలన వీడియో.. సమోసా కోసం గొడవ.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..!

"సాల్ట్ టైఫూన్" సైబర్ దాడులు(Cyber Attacks) కేవలం డేటా దొంగిలించడం మాత్రమే కాకుండా, ఫోన్ కాల్స్ వినడం, మెస్సేజ్‌లు చదవడం వంటి సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడ్డాయి. ఈ హ్యాకర్లు ఎన్‌క్రిప్ట్ చేసిన సందేశాలను కూడా డీకోడ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారని చెబుతున్నారు. ఈ సైబర్ దాడులు ప్రపంచ భద్రతకు పెను ముప్పుగా మారాయని, అన్ని దేశాలు తమ సైబర్ రక్షణ వ్యవస్థలను వెంటనే బలోపేతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: షాకింగ్ వీడియో.. భర్త మాటలు విని బిల్డింగ్ పైనుంచి దూకేసిన భార్య..!

ఈ ఆరోపణలపై చైనా రాయబార కార్యాలయం స్పందిస్తూ, ఈ ఆరోపణలు "పుకార్లు" మాత్రమేనని కొట్టిపారేసింది. అయితే, అమెరికా ప్రభుత్వం ఈ నేరాలకు పాల్పడుతున్న హ్యాకర్లపై తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే యు.ఎస్. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కూడా ఈ సైబర్ దాడుల కారణంగా ఆంక్షలను ప్రకటించింది. ఈ సైబర్ దాడులు సైనిక, ఆర్థిక రంగాలపై ఎంతటి ప్రమాదాన్ని కలిగించగలవో స్పష్టంగా తెలియజేశాయి. ఇది కేవలం సైబర్ యుద్ధం మాత్రమే కాదని, ఇది ప్రపంచ భద్రతకు పెను ముప్పు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు