డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. 10 టెరాబైట్ల డేటా లీక్

ప్రపంచ ప్రఖ్యాత హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ మరోసారి రష్యాను టార్గెట్ చేసింది. ఆ దేశానికి సంబంధించి 10 టెరాబైట్ల డేటాను లీక్ చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉందని తెలిపింది.

New Update
Leaked Data

Leaked Data

ప్రపంచ ప్రఖ్యాత హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ మరోసారి కలకలం సృష్టించింది. ఈసారి రష్యాను టార్గెట్ చేసింది. ఆ దేశానికి సంబంధించి 10 టెరాబైట్ల డేటాను లీక్ చేసింది. ఇలా లీక్ అయిన డేటాను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు సోషల్ మీడియా ద్వారా అనామకస్ పోస్ట్ చేశారు. అయితే ఈ లీక్ అయిన డేటాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఒక ఫైల్ కూడా ఉందని తెలిపింది. దీనికి లీక్డ్ డేటా ఆఫ్ డోనాల్డ్ ట్రంప్ అని చెబుతూ పోస్ట్ చేసింది.

ఇది కూడా చూడండి:DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి

ఇది కూడా చూడండి:Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

లీక్ అయిన ఫైల్‌లో ఏముందని..

ఈ డేటాలో రష్యన్ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రెమ్లిన్‌తో లింక్ అయిన ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. అయితే ఈ లీక్ అయిన ఫైల్‌లో డేటా ఏముందనే విషయంపై క్లారిటీ లేదు. అయితే అనామకస్ ట్రంప్‌పై రష్యాతో లోతైన సంబంధాలు ఉన్నాయని, గూఢచర్యం వంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. రష్యాపై అనామకస్ ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు చాలా సార్లు కూడా సైబర్ దాడి చేసింది. గతంలో కూడా రష్యా లోపల జరుగుతున్న వ్యాపారాలు, ప్రభుత్వ మిత్రదేశాలు, ఆస్తి పెట్టుబడులకు సంబంధించిన అనేక రహస్యాలు కూడా బయటకు వచ్చాయట.

ఇది కూడా చూడండి:Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

Advertisment
తాజా కథనాలు