/rtv/media/media_files/Im4K3O2M7sfd5gfohKJ6.jpg)
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సేవలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఎక్స్ సేవలు యాక్సిస్ చేయలేక నెటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. పోస్ట్స్ ఆర్ నాట్ లోడింగ్ రైట్ నౌ అని చూపిస్తోంది. అయితే కాసేపటి తర్వాత మళ్లీ సేవలు ప్రారంభమయ్యాయి.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్లకు ‘వైట్ జాకెట్’.. ఇంత ప్రాధాన్యత ఉందా?
ఎక్స్ సంస్థ వెంటనే ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలాసార్లు ఎక్స్ సేవలకు అంతరాయం ఏర్పడి సంగతి తెలిసిందే. కొద్ది సేపటి తర్వాత లేదా కొన్ని గంటల తర్వాత కంపెనీ సేవలను పునరుద్ధరించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తాయి.
Also Read: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్
దీని పై ఎక్స్ యజమాని ,బిలియనీర్ మస్క్ స్పందించారు.ఎక్స్ పై భారీ సైబర్ దాడి జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోస్టు కూడా చేశారు. మేము ప్రతిరోజు సైబర్ దాడికి గురవుతున్నాం. అయితే ప్రస్తుతం జరిగిన దాని వెనుక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్ లేదా ఒక దేశ హస్తం ఉంది అంటూ పేర్కొన్నారు. ఎలా జరిగిందో ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు.
ఒకేరోజు మూడు సార్లు...
ట్రేసింగ్ సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం..ఎక్స్ సేవల్లో ఒకేరోజు మూడు సార్లు అంతరాయం నెలకొంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పలువురు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక 7.30 గంటల సమయంలో మరోసారి డౌన్ అయ్యింది. ఇక రాత్రి 9 గంటలకు మళ్లీ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
దీంతో పలువురు ఎక్స్ ను యాక్సెస్ చేసుకోలేకపోయారు.56 శాతం మంది యాప్ యూజర్లు,వెబ్‌సైట్ వాడుతున్నవారిలో 33 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికా, ఇండియా,యూకే,ఆస్ట్రేలియా,కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఈ అంతరాయం నెలకొంది. దాదాపు 40,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు.
Also Read: Cyber Crimes: సైబర్ నేరగాళ్ల వలలో భారతీయులు.. ఎట్టకేలకు 500 మంది స్వదేశానికి