/rtv/media/media_files/2025/04/29/DxJzVPuzJdAbFhfaZETI.jpg)
Pakistani Hackers Fail To Breach Indian Cyber Defences As LoC Tensions Escalate
Pakistan Cyber Attack: పహల్గాం దాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్ పై సైబర్ దాడులు(Cyber Attacks On India) కూడా చాలా ఎక్కువగా జరిగాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్(Bangladesh) కు చెందిన పలు గ్రూప్ లు వరుసపెట్టి భారత వెబ్ సైట్లపై దాడులు చేశాయి. దాదాపు 15 లక్షల సైబర్ దాడులు జరిగాయని మహారాష్ట్ర సైబర్ అధికారులు తెలిపారు. షాడో ఆఫ్ పహల్గామ్ పేరుతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన గ్రూపులు ఇవి నిర్వహిస్తున్నాయి.ఈ సైబర్ దాడులు పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్, మొరాకో మరియు ఇండోనేషియా నుండి వచ్చాయి.
Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?
15 లక్షలు...ఏడు గ్రూప్ లు..
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆగిపోయాయి. సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. కానీ సైబర్ దాడులు మాత్రం ఆగలేదు అని చెబుతున్నారు అధికారులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మొరాకో మరియు మధ్యప్రాచ్య దేశాల నుండి ఈ దాడులు కొనసాగుతున్నాయి అని చెబుతున్నారు. ఆ దాడులలో మాల్వేర్ పంపిణీ, DDoS దాడులు, GPS స్పూఫింగ్ ఇంకా వెబ్ సైట్ పని చేయకుండా చేయడం వంటి వాటికి పాల్పడ్డారు. భారతదేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఆ దాడులను నిర్వహించారు. వీటి మీద మహారాష్ట్ర సైబర్ విభాగం ఓ నివేదికను రూపొందించింది.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
దీనికి రోడ్ ఆఫ్ సింధూర్ అని పేరు పెట్టింది. మొత్తం 15 లక్షల సైబర్ దాడులు జరగ్గా...వాటిల్లో 150 తప్ప మిగతా వాటన్నిటినీ నిర్వీర్యం చేశారు. APT 36, పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇన్సేన్ PK, మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హ్యాక్స్ సెక్, సైబర్ గ్రూప్ HOAX 1337, నేషనల్ సైబర్ క్రూ అనే గ్రూప్ లు ప్రధానంగా ఈ దాడులకు పాల్పడ్డాయి. అంతేకాదు వీటి ద్వారా భారత వ్యవస్థలు కుప్ప కూల్చామని కూడ అటాకర్స్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అయితే అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ రావడం వలన ఎటువంటి పెద్ద ప్రమాదం జరగలేదని మహారాష్ట్ర సైబర్ విభాగం తెలిపింది.
Also Read: ఎన్టీఆర్ సరసన 'సాహో' బ్యూటీ..!
today-latest-news-in-telugu | Cyber Attacks
Also Read: Balochistan Independence: పాక్ కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్!