Cyber Attacks: పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు

పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు జరిగాయి. ఇవన్నీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ గ్రూపుల దగ్గర నుంచే ఇవన్నీ ఎదురవుతున్నాయి. షాడో ఆఫ్ పహల్గామ్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. 

New Update
pak

Cyber Attack

Cyber Attacks: పాకిస్తాన్(Pakistan)...భారత్(India) మీద అన్ని రకాలుగా దాడులు చేస్తూనే ఉంది. పహల్గామ్ లో దాడి(Pahalgam Terror Attack) తరువాత నుంచి బోర్డర్ లో కాల్పులు చేస్తూ కవ్విస్తోంది పాక్ సైన్యం. మరో వైపు సైబర్ దాడులు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. దాడి తరువాత నుంచి ఇప్పటి వరకు 10 లక్షల సైబర్ దాడులు జరిగాయి. షాడో ఆఫ్ పహల్గామ్ పేరుతో పాకిస్తాన్, బంగ్లాదేశ్(Bangladesh) కు చెందిన గ్రూపులు ఇవి నిర్వహిస్తున్నాయి. దీనిపై మహారాష్ట్ర సైబర్ విభాగం ఒక ప్రత్యేక నివేదికను రూపొందించింది. ఈ సైబర్ దాడులు పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్, మొరాకో మరియు ఇండోనేషియా నుండి వచ్చాయి. ఇందులో, అన్ని గ్రూపులు తమను తాము ఇస్లామిక్ గ్రూపులుగా పిలుచుకుంటున్నాయి. 

Also Read:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

పాకిస్తాన్, బంగ్లాదేశ్ గ్రూపులు..

ఇలా సైబర్ దాడులు చేస్తున్న గ్రూపుల్లో మొదటిది ఇన్సేన్ పీకే. ఇది పాకిస్తాన్ కు చెందిన గ్రూప్. వీళ్ళు భారత ఆర్మీ ,కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జలంధర్, సైనిక్ వెల్ఫేర్, హోటల్ పంజాబ్ ,జమ్మూ & కాశ్మీర్ ,ఆర్మీ పబ్లిక్ స్కూల్ పంజాబ్ ప్రాంతంలో ఈ దాడులను నిర్వహించారు.  వీళ్ళ నుంచి సైబర్ దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇది కాకుండా బంగ్లాదేశ్ నుంచి కూడా ఈ దాడులు ఎక్కువగానే అవుతున్నాయి. మిస్టీరియస్ టీమ్ బంగ్లాదేశ్ అన్న పేరుతో ఉన్న గ్రూప్ చాలా ఎక్కువగా సైబర్ దాడులు చేస్తోంది. వీళ్ళందరూ వీటి ద్వారా భారత ఐటీ వ్యవస్థను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదొక్కటే కాకుండా ఎడ్యుకేషన్ పోర్టల్, రేట్ ఫోరం, క్లోన్ ETC లను టార్గెట్ చేస్తున్నారు. ఈ-గవర్నెన్స్, స్టేట్ పోర్టల్ , బ్యాంకులు కూడా వీళ్ళ లక్ష్యాలుగా ఉంటున్నాయి. 

Also Read: 'స్పిరిట్' మొదలయ్యేది అప్పుడే..! సాలిడ్ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్

ఇప్పటివరకు జరిగిన అన్ని సైబర్ దాడులు ముఖ్యమైన సంస్థల మీదనే జరిగాయి. సైబర్ భద్రతా వ్యవస్థలు బలహీనంగా ఉన్నచోట వారు విజయం సాధించారు. ఇటీవల డోమినోస్ పిజ్జా డేటా లీక్ అయింది. ఇందులో కస్టమర్ల వివరాలు అన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళాయి. డార్క్ వెబ్ లీక్‌లలో భారీ మొత్తంలో భారతీయ టెలికాం డేటా విడుదలైందని మహారాష్ట్ర సైబర్ పోలీస్ ఏడీజీ యశస్వి యాదవ్ చెప్పారు. కంపెనీలన్నీ సైబర్ భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని...దానిని పెంచుకోవాలని ఆయన సూచించారు. 

today-latest-news-in-telugu | india | pakistan | bangladesh | cyber-attacks

Also Read: PAk: పాకిస్తాన్ ను తిరస్కరిస్తే రక్తం ప్రవహిస్తోంది..ప్రధాని మోదీపై బిలావల్ భుట్టో ప్రేలాపన

Advertisment
తాజా కథనాలు