TG News: ఖమ్మంలో అర్థరాత్రి హైటెన్షన్ .. ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమాస్పద మృతి!
ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైటెన్షన్ చోటుచేసుకుంది. గొల్లగూడెం ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని భూక్యా ప్రతిమ అనుమాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైటెన్షన్ చోటుచేసుకుంది. గొల్లగూడెం ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని భూక్యా ప్రతిమ అనుమాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ వేధింపులను తట్టుకోలేక కుమార్ యాదవ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నాగోల్ షటిల్ స్టేడియంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో తోటి ఆటగాళ్లు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో నేషనల్ హైవేపై ఓ మహిళను కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందింది. హైవేపై రోడ్డు దాటడానికి నలుగురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు పక్కన నిల్చోని ఉన్న నలుగురు మహిళల్లో ఒకరు స్పాట్లోనే మృతి చెందారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం జరిగింది. టీచర్ వేధింపుల తాళలేక ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ చిచ్చు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 5 రోజుల వ్యవధిలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడం స్థానికంగా కలకలం రేపుతోంది.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల క్రితం భర్తను భార్య హత్య చేసిన మిస్టరీ తేటతెల్లమయ్యింది. తాగుడుకు, జూదానికి బానిసైన భర్త ఇంట్లో వస్తువులు అమ్ముతూ భార్యను వేధిస్తుండేవాడు. అతడి తీరుపట్ల విసిగిపోయిన భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది.
2011లో కేరళలో ఓ హత్యాచార కేసు సంచలనం రేపింది. ఈ కేసులో దోషిగా తేలిన గోవిందచామీ (49) ప్రస్తుతం కన్నూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున అతడు పోలీసుల కళ్లు గప్పి జైలు గొడ దూకి పరారయ్యాడు.