Hyd Crime: రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. పిల్లల ముందే ప్రాణాలు కోల్పోయిన తల్లి!
హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. పిల్లలను బోగీలోకి ఎక్కించాక తాను ఎక్కే ప్రయత్నంలో శ్వేత అనే మహిళ కాలుజారి బోగీ, ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందింది.