/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
TG News: తెలంగాణ వ్యాప్తంగా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు పక్కా సమాచారం రావటంతో ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు చేయగా.. హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేసిన సోదాలతో రాష్ట్రంలో కొత్త రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈడీ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి ప్రభుత్వం ప్రతిపాదించిన సంక్షేమ కార్యక్రమాల్లో భారీ అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇది కూడా చదవండి: ధూమపానం దూల తీర్చిదట.. క్యాన్సర్‌తోపాటు ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్లే
గొర్రెల పంపిణీ భారీ స్కాం..
ఈడీ అధికారులు హైదరాబాదుతో సహా మొత్తం ఎనిమిది ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. వీటిలో ప్రధానంగా హైదరాబాద్‌లో ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. వీటిలో అధికారుల సోదాలు వరుసగా మంత్రి, ఉన్నత అధికారులతో సంబంధం ఉన్న నివాసాలు, ఆఫీసులు, తదితర ప్రాంతాలను తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల నేపథ్యంగా ప్రజల మధ్య ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్‌తో సంబంధించి.. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక అనుమానాలను నివారించడానికి ఈడీ తగు చర్యలు తీసుకుంటోంది.
ఇది కూడా చదవండి: నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే
ఈ కేసు పేదలకు ప్రభుత్వం అంగీకరించిన గొర్రెల పంపిణీకి సంబంధించి అక్రమాలు జరగడం వల్ల పలు అనుbeమాలు వస్తున్నాయి. ఈ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కంపెనీలు లభ్యమైన గొర్రెలను సైతం వ్యవసాయ కేంద్రాలలో పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు కేసు నుంచి అన్ని సంబంధిత వ్యక్తుల నిర్దారణకు, సంచలనం సృష్టించిన ఈ చర్యలు మరింత కఠినంగా చేపట్టారు. ఇప్పటికే పశు సంవర్థక శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశు సార్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్‌నాయక్ ఇంట్లో ఈడీ అధికారులు ఈడీ సోదాలు చేస్తున్నారు. ఈ దాడులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటో చూడాలి. మళ్లి ఇలాంటి స్కాంలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు..? నిజమైన అర్థం ఏమిటో తెలుసా?
ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పరారీలో ఉన్న మొయినుద్దీన్, ఈ క్రముద్దీన్ ఇంట్లో తనిఖీలు చేశారు. తెలంగాణలో గొర్రెల పెంపకం, పంపిణీ పేరుతో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకం పేరు మీద రూ.750 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం కింద వేల మంది లబ్ధిదారులకు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో అధికారులు, దళారులు నిధులు మోసం చేశారని ఏసీబీ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా మరి కొందరూ విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి ఆ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి వాటాలు పంచుకున్నారు. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ, ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.