Hyderabad News: అయ్యో బిడ్డా.. షటిల్ ఆడుతూనే గుండెపోటుతో! లైవ్ వీడియో వైరల్

నాగోల్ షటిల్ స్టేడియంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో తోటి ఆటగాళ్లు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

New Update
nagole incident

nagole incident

అతడికి 25 ఏళ్ళు..  ఫ్రెండ్స్ తో సరదాగా షటిల్ ఆడుకుందామని వెళ్ళాడు. కానీ అదే అతడి ఆఖరి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. అప్పటివరకు ఫ్రెండ్స్ సరదా ఆడుతూ ఉన్న యువకుడు ఒక్కసారిగా  కుప్పకూలి చనిపోయాడు!  ఆస్పత్రికి తీసుకెళ్తే గుండెపోటు అని తెలిపారు వైద్యులు. ఒక్క క్షణంలో అతడి నిండు జీవితం ముగిసిపోయింది. క్షణం ముందు వరకు ఎంతో ఉత్సాహంగా షటిల్ ఆడిన కుర్రాడు.. మరు క్షణంలో విగతజీవిగా కనిపించటం స్టేడియంలోని ఆటగాళ్లను, తోటి స్నేహితులను ఆవేదనకు గురిచేసింది.  చేతికందిన కొడుకు కళ్ళ ముందు మృతి చెందడంతో  తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. 

Also Read: Rashmika: 'మైసా' మొదలైంది.. పూజ సెర్మనీలో రష్మిక డాన్స్ ఫొటోలు వైరల్!

Also Read :  నాగ పంచమి నాడు ఈ వస్తువులను అస్సలు వాడకండి

షటిల్ ఆడుతూనే.. 

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే జులై 27న రాత్రి 8 గంటల సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడేందుకు వెళ్ళాడు. అప్పవరకు ఉత్సాహంగా ఆటాడిన రాకేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో తోటి ఆటగాళ్లు స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా..అప్పటికే   మరణించినట్లు వైద్యులు  నిర్దారించారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ తో అతడు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ స్టేడియంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. 

ఒకప్పుడు గుండెపోటు అంటే అరవై, డెబ్భై ఏళ్ళ వయసు వారికి వచ్చే జబ్బుగా భావించేవారు.  కానీ ఇప్పుడు.. పట్టుమని పాతికేళ్ళు కూడా నిండకముందే గుండెపోటుతో రాలిపోతున్నారు ఎంతోమంది యువకులు! జిమ్ చేస్తూ, డాన్స్ చేస్తూ, ఆఫీసులో పని చేస్తూ, ఆటలు ఆడుతూ.. ఇలా ఎంతో మంది యువకులు గుండెపోటుతో నేలరాలిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.  

Also Read: This Week Ott Movies: ఈ వారం థ్రిల్లే థ్రిల్లు.. మీ మొబైల్ కి రాబోతున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే!

Also Read :  చిన్న బడ్జెట్.. కోట్లు కొల్లగొట్టింది! ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్!

Latest News | crime

Advertisment
తాజా కథనాలు