/rtv/media/media_files/2025/01/21/f0NIbUL9NxiP71kmgTFf.jpg)
Encounter
Crime News: జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు అప్రమత్తతమయ్యారు. సరిహద్దు నుంచి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు. ఈ సంఘటనను సంబంధిత భద్రతా అధికారులు విషయాన్ని తెలిపారు.ఈ దాడి వెనుక ప్రజల రక్షణకు సంబంధం ఉందని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలకు అందిన పక్కా సమాచారంతో బుధవారం తెల్లవారుజామున దాడులు చేశారు. అంతేకాదు ప్రత్యేకంగా రూపొందించిన జట్టు ముందస్తు వ్యూహంతో ఉగ్రవాదుల ఆట కట్టించారు. ఈ ప్రాంతం గతంలోనూ ఉగ్ర కార్య కలాపాలకు కేంద్రంగా నిలిచినదే.. అప్పటినుంచి భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నా కూడా కొన్ని చొరబాట్లు తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇద్దరు ఉగ్రవాదులు హతం:
భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేసిన ఇద్దరి ఉగ్రవాదులను గుర్తించి కాల్చివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. దాని తర్వాత వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలు, గోలీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది భారత్‌లో అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగంగా ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడితో ఉగ్రవాదుల పెద్ద ఎత్తున కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. చనిపోయిన ఉగ్రవాదుల గుర్తింపు వివరాలు బయట పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. వారు భారత్‌లోకి ఎందుకు వస్తున్నారో తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: ప్రతిరోజూ మాంసం తింటున్నారా..? నాన్-వెజ్ ప్రియులు ఆరోగ్యంపై జాగ్రత్త
పూంచ్ ప్రాంతంలోని కొంతమంది స్థానికులతోనూ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలన్నీ భద్రతా పరంగా ముందస్తు చర్యల్లో భాగమేనని భద్రతా దళాలు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరింత నిఘా పెట్టారు. రహదారి చెక్‌ఫోస్టుల దగ్గర తనిఖీ చేయటంతోపాటు డ్రోన్‌లతోనూ నిఘా పెంచారు. ఉగ్రదాడులపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా తీవ్రముగా తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు జరగ కుండా ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌లో శాంతిని భద్రపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది మరొక విజయమని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ధూమపానం దూల తీర్చిదట.. క్యాన్సర్‌తోపాటు ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్లే
దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్ర వాదులను భద్రతా దళాలు హతం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను ఉదయం పార్క్ పరిసరాల్లో గుర్తించిన భద్రతాదళాలు అప్రమత్తమై కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో సులేమాన్‌షాతోపాటు పహల్గాం దాడికి కారణమైన యాసిర్, అబూ హామ్‌జా మరణించిన్లు అధికారులు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులని అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో సీఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు. ఎన్ కౌంటర్ అనంతరం జరిపిన సోదాలు చేశారు. వాటిల్లో 17 గ్రెనెడ్లు, ఎం4 కార్బైన్, ఏకే 47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
( Latest News )